»   » కమల్‌హసన్ ఇంట్లో అగ్ని ప్రమాదం.... ఊపిరితిత్తులు పొగతో నిండిపోయాయ్ అంటూ ట్వీట్

కమల్‌హసన్ ఇంట్లో అగ్ని ప్రమాదం.... ఊపిరితిత్తులు పొగతో నిండిపోయాయ్ అంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్‌హసన్ ఇంట్లో అగిప్రమాదం.... ఊపిరితిత్తులు పొగతో నిండిపోయాయ్ అంటూ ట్వీట్

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ టైం ఏం బావున్నట్టులేదు... శబాష్ నాయుడు షూటింగ్ లో గాయపడి కోలుకున్నాడో లేదో మళ్ళీ ఇంకో ప్రమాదం తో మృత్యువు అంచుదాకా వెళ్ళొచ్చాడు. ఏపాత్రనైనా అవలీలగా పోషించే కమల హసన్ నిన్న రాత్రి పెట్టిన ట్వీట్ కి ఆయన అభిమానుల గుండెలు అదిఒరాయి....

నిన్న రాత్రి కమల్ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆయన స్టాఫ్ అప్రమత్తంగా ఉండటం తో పెద్ద నష్టం జరగకుండా క్షేమంగా బయట పడ్డాడు కమల్. మూడవ అంతస్తులో ఉన్న కమల్ అక్కడ నుంచి కిందకు చేరుకుని, క్షేమంగా బయటపడ్డాడు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం తో తన ఊపిరితిత్తులు పూర్తిగా పొగతో నిండిపోయాయని, ఈ ప్రమాదం లో ఎవరికీ ఏమీ కాలేదనీ చెప్పాడు.

ఈ ట్వీట్ చూడగానే అభిమానుల పరామర్శల వెల్లువ మొదలయ్యింది. కమల్ క్షేమ సమాచారం కోసం చాలామందే ఆందోళన చెందారు. దాంతో కాసెపటికి మళ్ళీ ఆన్ లైన్ లోకి వచ్చిన కమల్. "మీ అందరి ప్రేమకు కృతఙ్ఞతలు.. ఇక ఇప్పుడు నిద్ర పోవాలి" అంటూ ఇంకో ట్వీట్ పెట్టాడు. ఇటీవలే ఓ ప్రమాదంలో కమల్ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన ఒక సంవత్సర కాలం పాటు షూటింగ్ కు దూరంగా ఉన్నాడు.

ఈ మధ్యనే మళ్ళీ తన సినిమా శబాష్ నాయుడు షూటింగ్ పనులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే... ఓ కీలక పాత్రలో తెలుగు పాపులర్ కమెడియన్ బ్రహ్మానందం నటించనున్న ఈ సినిమాలో కమల్ కూతురుగా శృతి హాసన్, మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కమల్ హాసన్ రెండో కూతురు అక్షరా హాసన్ కూడా పనిచేస్తూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు సంగీతం ఇళయరాజా సమకూరుసున్నారు.

English summary
Kamal Haasan's residence caught fire on Friday night. The actor escaped the accident with the help of his staff.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu