»   » దటీజ్ సచిన్, అల్లు అర్జున్, రాంచరణ్.. కమల్‌కు అరుదైన గౌరవం..

దటీజ్ సచిన్, అల్లు అర్జున్, రాంచరణ్.. కమల్‌కు అరుదైన గౌరవం..

Written By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు కమల్ హాసన్ హవా రోజు రోజుకు పెరుగున్నది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న కమల్.. టెలివిజన్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. బిగ్‌బాస్ తమిళ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ యాజమాన్యంలో నడిచే తమిళ తలైవాస్ అనే కబాడీ జట్టుకు కమల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచిన్, టాలీవుడ్ ప్రముఖులు రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రో కబాడీ లీగ్ సర్వం సిద్ధం

ప్రో కబాడీ లీగ్ సర్వం సిద్ధం

ః5వ ప్రో కబాడీ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ జట్టుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ యజమాని అనే సంగతి తెలిసిందే.

తమిళ తలైవా జట్టు యజమానిగా సచిన్

తమిళ తలైవా జట్టు యజమానిగా సచిన్

కబాడీ క్రీడకు ప్రోత్సాహం అందిస్తూ ఏకంగా ఓ జట్టును కొనుగోలు చేయడంతో సచిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

జట్టుకు అంబాసిడర్‌గా కమల్

జట్టుకు అంబాసిడర్‌గా కమల్

తమిళనాడులో యువతను క్రీడలపట్ల ఆసక్తిని రేకేత్తించడానికి, క్రీడల పట్ల మక్కువ కలిగించడానికి కబాడీ జట్టుకు కమల్ హాసన్‌ను జట్టు అంబాసిడర్‌గా ఏర్పాటు చేశారు.

అరుదైన గౌరవం దక్కింది

అరుదైన గౌరవం దక్కింది

అంబాసిడర్‌గా ఎంపికైన కమల్ మాట్లాడుతూ.. కబాడీ క్రీడకు ప్రోత్సాహం కల్పించడానికి అవకాశం ఇచ్చి అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. ఈ క్రీడకు ప్రాచుర్యం కలిగించడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని కమల్ అన్నారు.

వేల సంవత్సరాల క్రితమే..

వేల సంవత్సరాల క్రితమే..


కబాడీ ఆట వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఆదరించారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న జట్టుకు నన్ను అంబాసిడర్ ఎంపిక చేయడం నా అదృష్టం.

క్రీడకు ప్రాచుర్యం లభించడానికి..

క్రీడకు ప్రాచుర్యం లభించడానికి..

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మరింత వచ్చేందుకు కృషిచేస్తాను. యువతను కోరుతాను అని కమల్ అన్నారు.

శభాష్ నాయుడిగా కమల్

శభాష్ నాయుడిగా కమల్

ప్రస్తుతం కమల్ హాసన్ శభాష్ నాయుడు అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం తెలుగు, తమిళ, ఇతర భాషల్లో నిర్మిస్తున్నారు. కాలికి గాయం కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొంతకాలంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

28న లీగ్ ప్రారంభం

28న లీగ్ ప్రారంభం

ఐదో ప్రో కబాడీ టోర్నమెంట్ జూలై 28న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. తమిళ్ తలైవా జట్టుకు సచిన్ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.

బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ

బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ

తమిళ బిగ్‌బాస్ కార్యక్రమానికి కమల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళంలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని తెలుస్తున్నది.

సచిన్ చేతుల మీదుగా జెర్సీ ఆవిష్కరణ

సచిన్ చేతుల మీదుగా జెర్సీ ఆవిష్కరణ


గురువారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళ తలైవా జట్టు జెర్సీని సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రాంచరణ్ కూడా పాల్గొన్నారు.

హాజరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

హాజరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

కార్యక్రమానికి హాజరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

ఆవిష్కరణకు రాంచరణ్

ఆవిష్కరణకు రాంచరణ్

తమిళ తలైవా జట్టు జెర్సీ ఆవిష్కరణకు వస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్

English summary
Actor Kamal Haasan is ambassador of team Tamil Thalaivas fifth season of Pro Kabbadi League. The tournament starts from 28 July in Hyderabad. Tamil Thalaivas is owned by a consortium of cricketer Sachin Tendulkar and businessman N Prasad. Sachin Tendulkar co-owner of Tamil Thalaivas, and actor Kamal Haasan, brand ambassador of the side, during the team's jersey launch in Chennai. Nimmagadda Prasad, Allu Aravind, Allu Arjun and Ramcharan Teja joined this event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu