»   » వీడియో : సినిమాలు ఫాలో కావద్దంటూ కమల్ హాసన్ మాటల్లో

వీడియో : సినిమాలు ఫాలో కావద్దంటూ కమల్ హాసన్ మాటల్లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ను తప్పని సరిగా ధరించాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ సూచించారు. తమిళనాడులో జూలై ఒకటో తేది నుంచి హెల్మెట్‌ ధరించడాన్ని తప్పనిసరి చేయడంపై ఆయన ఇలా స్పందించారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక వీడియోను కమల్ విడుదల చేశారు. ఆ వీడియోని మీరూ చూడండి.

కమల్ సార్...హెల్మెట్ ధరించమంటూ...

Posted by Suryaprakash Josyula on 29 June 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇదిలా ఉంటే.... కమల్ తాజా చిత్రం దృశ్యం రీమేక్ ..పాప నాశనమ్ నుంచి ...కుటుంబ సభ్యులందరినీ ఎక్కించుకుని కమల్ మోపెడ్ నడిపే పోస్టర్ ఒకటి ఆమధ్య విడుదలైంది. దానిలో కమల్ హెల్మెట్ పెట్టుకోలేదు. దానిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమల్ 'అది తప్పే' అంటూ క్షమాపణలు చెప్పాడు.

ఇంతకీ పై వీడియోలో ఆయనేం చెప్పారో తెలియాలంటే స్లైడ్ షో చూడండి

హెల్మెట్ తప్పనిసరి

హెల్మెట్ తప్పనిసరి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడపవద్దు. తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి.

వితండ వాదన

వితండ వాదన

సినిమాల్లో టూ వీలర్ నడుపుతున్నవారు హెల్మెట్ పెట్టుకుంటున్నారా అని కొందరు వితండ వాదన చేస్తున్నారు. అది సరికాదు.

అది కుదరదు కదా

అది కుదరదు కదా

సర్కస్ లలో పైపులు పెట్టుకుని గాలిలోకి ఎగురుతూంటారు. అది ఇంట్లో ఉన్న పైపులతో చేయటం కుదరదు కదా.

భధ్రత మధ్యే నటిస్తున్నాం

భధ్రత మధ్యే నటిస్తున్నాం

సినిమాల్లో భధ్రత మధ్యే మేము నటిస్తున్నాం. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకుని ద్వి చక్రవాహనం డ్రైవ్ చేయండి అని కోరారు.

సూపర్ మ్యాన్ అవలేం

సూపర్ మ్యాన్ అవలేం

సినిమాలు చూసి సూపర్ మ్యాన్ చేసిన వన్నీ చేయలేం కదా అదీ ఇంతే

English summary
Actor Kamal Advice To Fans “ Please Use Helmet, Don’t Follow The Cinema Scenes.
Please Wait while comments are loading...