For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విగ్రహం పెడతారని ఆశించి ఇవన్నీ చేయట్లేదు

  By Srikanya
  |

  చెన్నై: ''ఎన్నో కష్టాలకోర్చి.. చెమటోడ్చి ఒక్కొక్క పైసా సంపాదించాను. ఇదంతా మీరిచ్చిన డబ్బే. సేవ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా. 'పెట్రాల్‌దాన్‌ పిల్లయా'లో ఉన్న 2000 మందికి నేను 'తగప్పన్‌' (తండ్రి)గా ఉంటున్నా. స్వచ్ఛభారత్‌ కోసం ప్రధాని నా పేరు చెప్పినప్పుడు.. ఆ పేరు వెనుక మీరందరూ ఉన్నారన్న విషయాన్ని మరిచిపోకండి. మన గురించే చెబుతున్నారని మీరందరూ భావించాలి. నా విగ్రహం పెడతారని ఆశించి ఇవన్నీ చేయట్లేదు. ఇది నా బాధ్యత'' అని తెలియచేసారు కమల్ హాసన్.

  'మీ అందరి పేర్లను చెప్పలేకే ప్రధాని నా పేరు చెప్పారు. అందులో మీరందరూ ఉన్నారు. అసలు మీపేరే నా పేర'ని కమల్‌హాసన్‌ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. కమల్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్‌ పథకానికి నన్ను అంబాసిడర్‌గా ప్రధాని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఈ విషయమై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ పుట్టినరోజున కేక్‌ కట్‌ చేస్తారని, కానీ తాను చెరువును శుభ్రం చేసేందుకు వచ్చానన్నారు. ఇది ఒక్కరోజుతో ఆగిపోదని పేర్కొన్నారు. కాంచీపురం, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర జిల్లాల్లోని చెరువులను కూడా శుభ్రపరుస్తామని అన్నారు.

  కమల్‌ మాట్లాడుతూ.. '' ఏదో పార్టీల మాదిరిగా చేస్తున్నానని అనుకోవద్దు. నిజానికి ఇలాంటి సంక్షేమ పథకాల పంపిణీని తొలిసారిగా ప్రారంభించింది కమల్‌ అభిమానుల ప్రజాసేవా సంఘమే. 'అభిమాన సంఘా'న్ని 'నర్పని ఇయక్కం' (ప్రజాసేవా సంఘం)గా తొలిసారిగా మార్చిన ఘనత కూడా మీదే. నాకన్నా గొప్ప కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొందరు కొన్ని కారణాల వల్ల కనుమరుగయ్యారు. ఈ ప్రజాసేవా సంఘం నా తర్వాత కూడా కొనసాగాలని గతంలో చెప్పేవాణ్ని. ఇప్పుడూ అదే ఆశిస్తున్నాను''అని పేర్కొన్నారు.

  Actor Kamal Haasan Picks Up the Broom for 'Swachh Bharat' Campaign

  ఇక జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల కానున్నాయి. ‘ఉత్తమ విలన్‌', ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

  మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఉత్తమవిలన్‌', ‘విశ్వరూపం-2' సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

  కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

  దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  English summary
  Kamal has set himself a target of cleaning up 20 lakes across Tamil Nadu. While the campaign at the moment is largely celebrity-driven, the challenge, many say, would be to make it a people's movement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X