»   » అమ్మా నాన్నా ఆట వద్దంటున్న కమల్

అమ్మా నాన్నా ఆట వద్దంటున్న కమల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కమల్ హాసన్ మలయాళ డైరెక్టర్ టి. కె. రాజీవ్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని, దాని షూటింగ్ కూడా అత్వరలో మొదలు పెడుతున్నాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. చీకటి రాజ్యం ప్రమోషన్ సమయంలో మీడియా వద్ద ఈ ప్రకటన చేసారు.

అదే సమయంలో ఈ చిత్రం టైటిల్ కూడా ప్రకటించారు. తమిళంలో ‘అప్ప అమ్మ వేలయట్టు' మరియు తెలుగులో ‘అమ్మ నాన్న ఆట' అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేసాడు. కమల్ హాసన్ సరసన అమల అక్కినేని, జరీన వాహీబ్ లను ఎంపిక చేసారు.

ఇస ఈ సినిమాని యుఎస్ లో చిత్రీకరణ చేయాలి అని షెడ్యూల్ ప్లాన్ చేసారు కానీ ఏం జరిగిందో ఏమో..ప్రాజెక్టు పట్టాలు ఎక్కకుండానే ఆగిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘అమ్మ నాన్న ఆట' సినిమా పూర్తిగా ఆగిపోయినట్లే . ఇది వద్దనుకుని మరో కథతో ...కమల్ తన తదుపరి సినిమా ని కూడా టికె రాజీవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

Actor Kamal Haasan's Amma Naana Aaata Stopped

కమల్ తాజా విశేషాలకు వస్తే...

‘పాపనాశం' చిత్రానికి సంబంధించి బెస్ట్ ఏక్టర్ అవార్డుని కమల్‌హాసన్‌కు ఇచ్చారు. ఈ అవార్డును ఏవీఎం శరవణన్‌ చేతుల మీదుగా అందుకున్నారు కమల్.
తనని ఇంతవాడిని చేసిన సినిమా ఇండస్ట్రీని మరిస్తే తాను విశ్వాసఘాతకుడినేనని కమల్‌హాసన్‌ తెలిపారు. వీ4 సంఘం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో ఇటీవల ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రష్యన్‌ కల్చరల్‌ సెంటర్‌ వేదికైంది.

కమల్‌ మాట్లాడుతూ.. పాఠశాలకు కూడా వెళ్లలేకపోయిన నేను.. ఇప్పుడు విదేశంలోని ఓ ప్రముఖమైన విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రసంగం చేయనున్నాను. ఈ ఉన్నతస్థాయిని ఇచ్చిన ఘనత సినిమాదే. ఆ విషయాన్ని మరిస్తే నేను విశ్వాసఘాతకుడితో సమానం.

ఏవీఎం సంస్థే నా పాఠశాల. ప్రస్తుతం కొత్త కళాకారులు, నటులు, దర్శకులు చాలా మంది వస్తున్నారు. వారికి నేను చెప్పేదేమంటే... మాకన్నా వేగంగా వెళ్లండి, తగినంత హోంవర్కు చేసిన తర్వాతే షూటింగ్ కు వెళ్లండి' అని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా అరవింద్‌స్వామికి ఉత్తమ విలన్‌ (తని ఒరువన్‌), ఉత్తమ దర్శకుడు మణికంఠన్‌, యువ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌, కమర్షియల్‌ దర్శకుడు సుందర్‌.సి, ఉత్తమ నిర్మాత తేనాండాల్‌ ఫిలిమ్స్‌ మురళి రామస్వామిలకు అవార్డులను అందజేశారు.

English summary
Actor-filmmaker Kamal Haasan will star in a trilingual film to be made in Tamil, Malayalam and Telugu. To be helmed by National Award-winning filmmaker T.K. Rajeev Kumar, the film has been titled “Amma Nanna Aata”. But now the movi is called off.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu