»   » ఆ స్టార్స్.... రెండో పెళ్లి కూడా పెటాకులైంది!

ఆ స్టార్స్.... రెండో పెళ్లి కూడా పెటాకులైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమకు చెందిన వారి విషయంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఏళ్ల తరబడి కాపురం చేసిన నటీనటులు పలు కారణాలతో విడిపోతున్నారు. తాజాగా తమిళ నటుడు రంజిత్, నటి రాగసుధ కూడా విడాకులు తీసుకున్నారు.

తమిళంలో పలు చిత్రాల్లో నటించిన రంజిత్.... రాగసుధను గతేడాది రెండో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని రంజిత్ కూడా ధృవీకరించారు. రాగసుధ తల్లి కూడా వీరు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు.

Actor Ranjit - Ragasudha divorced

తమిళ నటి ప్రియారామన్ తో రంజిత్ మొదటి వివాహం జరిగింది. అయితే 13 ఏళ్ల కాపురం తర్వాత వారి దాంపత్య జీవితం ముక్కలైంది. ప్రియారామన్ తో విడిపోయిన తర్వాత రాగసుధను వివాహం చేసుకున్నాడు. రంజిత్, రాగసుధ విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలుపలేదు.

ప్రస్తుతం తన సినీ కెరీర్ మీదనే దృష్టి సారించినట్లు నటుడు రంజిత్ తెలిపారు. ప్రస్తుతం రంజిత్ ‘అధిబార్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Tamil Actors Ranjit, Ragasudha divorced.
Please Wait while comments are loading...