Siddharth పై ట్రోల్స్‌తో ఊచకోత.. సైనా నెహ్వాల్ ట్వీట్‌పై వివాదాస్పద కామెంట్.. తాట తీస్తున్న మహిళలు
దక్షిణాది నటుడు సిద్దార్థ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాదు.. ప్రధాని నరేంద్రమోదీపై ట్వీట్లతో విరుచుకుపడటంలో ముందుంటాడు. అయితే ప్రధాని నరేంద్రమోదీ భద్రత గురించి బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై వివాదాస్పదంగా సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. అయితే సిద్దార్థ్ తన ట్వీట్‌లో పేర్కొన్న పదాలు మహిళలను లైంగికంగా కించపరచడమే అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు ట్రోలింగ్‌తో ఊచకోతకు పాల్పడ్డారు. సిద్దార్థ్, సైనా నెహ్వాల్ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Recommended Video

పంజాబ్‌లో ప్రధాని భద్రతలో లోపాలు
ఇటీవల పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంపై సైనా నెహ్వాల్ స్పందించారు. ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే.. ఏ దేశం కూడా సురక్షితంగా ఉన్నట్టు ఒప్పుకోదు. ప్రధాని మోదీపై పిరికిపందల దాడిని తీవ్రంగా వ్యతిరేకించాలి. మోదీకి దేశ ప్రజలు మద్దతుగా ఉండాలి అంటూ #BharatStandsWithModi #PMModi సైనా నెహ్వాల ట్వీట్ చేసింది.

సైనా నెహ్వాల్ ట్వీటుపై సిద్దార్థ్
అయితే సైనా నెహ్వాల్ ట్వీట్‌పై సిద్దార్థ్ స్పందిస్తూ.. సటిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. ఇండియాకు రక్షణగా నిలిచే వారున్నందుకు దేవుడికి థ్యాంక్ చెప్పుకోవాలి. షేమ్ ఆన్ యూ రిహన్నా అని సిద్దార్థ్ ట్వీట్ చేశారు. అయితే Subtle Cock అనే పదాలు ఉపయోగించడం మహిళలను బూతులు తిట్టడమే.. మహిళలపట్ల సిద్దార్థ్ ఇలాంటి పదాలు వాడటం సరికాదు అంటూ నెటిజన్లు దుయ్యబట్టారు.

సిద్దార్థ్‌పై చిన్మయి శ్రీపాద ఘాటుగా
సిద్దార్థ్ చేసిన ట్వీట్ గురించి గాయని చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. బుద్ది ఉన్న వాళ్లు ఇలాంటి పదాలు ఉపయోగించరు సిద్దార్థ్. మహిళలపై జరుగుతున్న వివక్షపై పోరాడాల్సింది పోయి ఇలాంటి ట్వీట్లు చేస్తావా అనే విధంగా చిన్మయి శ్రీపాద తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ముమ్మాటికి సిద్దార్థ్ చేసిన ట్వీట్ సమర్ధనీయం కాదు అనే విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జాతీయ మహిళా కమిషన్ స్పందన
సైనా నెహ్వాల్, సిద్ధార్థ్ మధ్య చోటుచేసుకొన్న ట్వీట్ వివాదంపై నేషనల్ కమిషన్ ఫర్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి అకౌంట్ ఇంకా ఎందుకు ఉన్నది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారు అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సైనా, సిద్దార్థ్ మధ్య వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

ట్వీట్‌ను సమర్ధించుకొన్న సిద్దార్థ్
అయితే సైనా నెహ్వాల్‌పై చేసిన ట్వీట్ గురించి స్పందిస్తూ.. తాను చేసిన ట్వీట్ సరైనదే అంటూ సిద్దార్థ్ సమర్ధించుకొన్నారు. కాక్ అండ్ బుల్ అనే పదాలు ఉదాహరణకు తీసుకోవడం తప్పేమీ కాదు. నా ట్వీట్‌లో ఎలాంటి బూతు గానీ, మహిళలను అవమానించే విధంగా పదాలు లేవు అనే విధంగా సిద్దార్థ్ మరో ట్వీట్ చేశాడు.

సిద్దార్థ్ ట్వీట్ సరికాదు.. సైనా స్పందన
అయితే సిద్దార్థ్ చేసిన ట్వీట్‌పై సైనా నెహ్వాల్ స్పందించింది. అతడు ఏ ఉద్దేశంతో చేసాడో తెలియదు. నేను ఒక యాక్టర్‌గా మంచిగా ట్రీట్ చేస్తాను. కానీ ఆయన ట్వీట్ చేసిన విధానం సరికాదు. అతడు స్పందించాలనుకొంటే ఇంకా మంచి పదాలతో స్పందించవచ్చు. ట్విట్టర్‌లో అలాంటి పదాలు ఉపయోగించి ఉండాల్సింది కాదు. ప్రధాని భద్రత ఓ సమస్య కాకపోతే.. దేశంలో ఇంకా భద్రత ఎలా ఉంటుంది అని సైనా నెహ్వాల్ అన్నారు.


Click it and Unblock the Notifications











