twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఫోన్ కి గంటకు 500 కాల్స్.. నన్ను, నా కుటుంబాన్ని రేప్ చేసి చంపేస్తారట..సిద్దార్థ్ సంచలన ఆరోపణ

    |

    లవర్ బాయ్ గా సినిమాలు చేసిన సిద్దార్ద్ గత కొంతకాలంగా వెనుకబడ్డారు. వెనుకపడడం అనే కంటే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడిప్పుడే కాస్త అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆయన కొద్ది రోజులుగా మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీద బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎటాక్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి సిద్దార్ద్ సంచలన ఆరోపణలు చేశారు.

    హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా

    బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నటుడు సిద్ధార్థ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్ సినిమాలతో కొనసాగినా ఇప్పుడు అంతా అయిపొయింది. చాలా ఏళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో అతను సతమలమవుతున్నాడు. అయితే ఇదివరకటిలా సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలపై తన వాయిస్ వినిపిస్తున్నారు. కరోనా సమయంలో సిద్ధార్థ్ పలు సందర్భాల్లో తన వాయిస్ వినిపించి జనాన్ని చైతన్య పరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు, వ్యవస్థలపై సిద్ధార్థ్ చేసే విమర్శలు జనాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

     బీజేపీ లీక్ చేసింది

    బీజేపీ లీక్ చేసింది

    తన ఫోన్ నంబర్ లీక్ అయిందన్న ఆయన , బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ తన నంబర్ లీక్ చేసిందని ఆయన ఆరోపించారు. ఆ నెంబర్ లీక్ కావడంతో తనకు, తన కుటుంబానికి అత్యాచారం చేసి చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు సిద్ధార్థ్. ఈ మేరకు ట్వీట్ "నా ఫోన్ నెంబర్ ను తమిళనాడు బీజేపీ సభ్యులు, బిజెపి తమిళనాడు ఐటీ సెల్ వాళ్ళే లీక్ చేశారు.

    నన్ను టార్గెట్ చేశారు

    నన్ను టార్గెట్ చేశారు

    నాకు, నా కుటుంబానికి 24 గంటల్లో 500కు పైగా అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. అన్ని నెంబర్లు రికార్డ్ చేశాను (బిజెపి లింకులు మరియు డిపితో సహా). వాటిని పోలీసులకు ఇస్తున్నాను. నేను నోరు మూసుకుని కూర్చోను. ప్రయత్నిస్తూ ఉంటాను' అంటూ నరేంద్ర మోడీని, అమిత్ షాను సైతం ట్యాగ్ చేశాడు సిద్ధార్థ్. ఇక సిద్ధార్థ్ అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కోవిడ్ సంక్షోభ నిర్వహణపై అధికార పార్టీని విమర్శించారు సిద్ధార్థ్.

    Recommended Video

    Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
    వేధించమని చెప్పారు

    వేధించమని చెప్పారు

    తనను సోషల్ మీడియాలో బెదిరించిన వారి స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ "బీజేపీ తమిళనాడు సభ్యులు నిన్న నా నంబర్ లీక్ చేసి, నన్ను దాడి చేయమని, వేధించమని చెప్పారు. నన్ను బెదిరించిన అనేక సోషల్ మీడియా పోస్టులలో ఇది ఒకటి. కోవిడ్ నుంచి బయటపడగలం కానీ ఇలాంటి వాళ్ళతో సర్వైవ్ అవ్వగలమా ?" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు తనకు ఎదురైన వేధింపులకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ కూడా సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ''నా ఫోన్ నెంబర్ లీక్ చేసిన అనేక మంది బీజేపీ సభ్యుల పోస్ట్‌లలో ఇది ఒకటి. 'అతను కచ్చితంగా నోరు మూసుకోవాలి' అంటూ వాళ్లు నన్ను వేధిస్తున్నారు, నాపై దాడి చేస్తున్నారు. మనం కోవిడ్‌తో పోరాడగలం.. కానీ ఇలాంటి వాళ్లతో కాదు' అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.

    English summary
    Tamil actor Siddharth has alleged that his phone number has been leaked. He claimed that the BJP Tamil Nadu IT cell leaked his number. he also shared that because of this, he and his family have been receiving 'abuse, rape and death threats'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X