»   » ప్రముఖ దర్శకుడు మృతి, హీరో సూర్య నివాళులు(ఫొటోలు)

ప్రముఖ దర్శకుడు మృతి, హీరో సూర్య నివాళులు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ దర్శకుడు, నటుడు 'వియత్నాం వీడు' సుందరం (73) చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నటించిన, డైరక్ట్ చేసిన చిత్రాలు చాలా వరకూ తెలుగులోకి అనువాదం అయ్యి, ఇక్కడా ప్రజాదరణ పొందాయి.

హీరో సూర్య ...ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయారని పేర్కొంటూ, ఆయన ఇంటికి వెళ్లి పార్దవ దేహాన్ని దర్శించి, నివాళులు అర్పించారు. సూర్యకు తొలినుంచి సుందరం అంటే మంచి అభిమానం. ఆ ఫొటోలు మీకు అందిస్తున్నాం.

ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ మంచి దర్శకనటుణ్ని కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు. మరోవైపు దర్శకుడు మనోబాలా, సుందర్‌.సి, నటి ఖుష్బూ తదితరులు నివాళి అర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి బెంజమిన్‌ ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు. శనివారం సాయంత్రం మైలాపూర్‌లోని శ్మశాన వాటికలో సుందరం అంత్యక్రియలు జరిగాయి. సుందరానికి భార్య చెల్లా, కుమార్తెలు అను, శ్వేత ఉన్నారు.

సూర్య తో ఫొటోలు, సుందరం గురించి మరిన్ని విశేషాలు..

పేద కుటుంబం అయినా

పేద కుటుంబం అయినా


సుందరం...తిరుచ్చిలో పేద కుటుంబంలో సుందరం జన్మించారు. ఆయన పొట్ట చేతపట్టుకుని పదేళ్ల వయస్సులో చెన్నైకి వచ్చారు. కొన్ని ప్రైవేటు కంపెనీల్లో కూడా పని చేశారు.

ఇంటిపేరుగా

ఇంటిపేరుగా


అనంతరం వైజీ పార్థసారథి నాటక యూనిట్ లో చేరారు. శివాజీగణేశన్‌ నటించిన ‘వియత్నాం వీడు' చిత్రానికి కథ, మాటలు రాశారు. అప్పటి నుంచి ఆయనకు ‘వియత్నాంవీడు' ఇంటి పేరుగా మారిపోయింది.

ఆ తర్వాత

ఆ తర్వాత


అమితమైన ప్రజాదరణ పొందారు. శివాజీ గణేశన్‌కు మంచి మిత్రుడు. 4

దర్శకత్వం..

దర్శకత్వం..


శివాజీ నటించిన గౌరవం, జ్ఞానపరవై వంటి పలు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

అనేక పాత్రలు

అనేక పాత్రలు


పలు సినిమాల్లో భిన్నమైన పాత్రలు కూడా పోషించారు.

అనారోగ్యంతోనే..

అనారోగ్యంతోనే..


కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

English summary
Veteran South Indian film director and scriptwriter “Vietnam Veedu’ Sundaram passed away in Chennai on Friday night. He was 76 and is survived by his wife and two daughters.Actor Suriya paid his last respects to the veteran filmmaker and writer "Vietnam Veedu" Sundaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu