సూర్యపై నోరుపారేసుకొన్న యాంకర్లు.. విశాల్ ఫైర్.. రోడ్లపై ఫ్యాన్స్ రచ్చ!
Recommended Video

విలక్షణ నటుడు, తమిళ సినీ హీరో సూర్య ఎత్తుపై ఇద్దరు యాంకర్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో వివాదంగా మారింది. యాంకర్ల వ్యాఖ్యలపై భగ్గుమన్న సూర్య ఫ్యాన్స్ సదరు టీవీ ఛానెల్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ వివాదం వెనుక అసలు కారణమేమిటంటే..

బిగ్‌బీతో హీరో సూర్య
హీరో సూర్య తాజాగా దర్శకుడు కేవీ ఆనంద్ రూపొందించే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించేందుకు బిగ్ బీ అమితాబ్‌ను రంగంలోకి దించారు. ఈ అంశంపై తమిళ టెలివిజన్ చానెల్‌లో ప్రసారమయ్యే ఫ్రాంకా సొలట్టా అనే కార్యక్రమంలో చర్చ జరిగింది.
సూర్యపై అనుచిత వ్యాఖ్యలు
ఫ్రాంకా సొలట్టా అనే కార్యక్రమంలో ఇద్దరు యాంకర్లు హద్దు మీరి సూర్య ఎత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమితాబ్‌తో నటించే సమయంలో సూర్య స్టూల్ వేసుకోవాల్సిందే అని అడ్డదిడ్డంగా కామెంట్లు చేశారు.

అనుష్క శెట్టితో నటించేటప్పుడు
సూర్యపై అలాంటి వ్యాఖ్యలు చేస్తూ అంతటితో ఊరుకొన్నారా అంటే అదీ లేదు. ఓ అడుగు ముందుకేసి తమ నోటి దురుసు బయటపెట్టారు. సింగం చిత్రం షూటింగ్‌లో అనుష్కతో నటించేటపపుడు హీల్స్, స్టూల్స్ వేసుకొన్నాడు అని యాంకర్లు నోరుపారేసుకొన్నారు.

యాంకర్లపై ఫ్యాన్స్ ఫైర్
టెలివిజన్ యాంకర్ల ప్రవర్తనపై ఫ్యాన్స్ భగ్గుమన్నారు. యాంకర్ల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నిర్మాత జ్ఞానవేల్ రాజా, హీరో విశాల్ ట్వీట్టర్లో కడిగేశారు. సూర్య అభిమానులు రోడ్లపైకి వచ్చి టెలివిజన్ చానెల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

క్షమాపణ చెప్పాలని డిమాండ్
సూర్య ప్రతిష్ఠకు, ఇమేజ్‌కు భంగం కలిగే విధంంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్లు భేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. దాంతో రంగంలోకి సూర్య దిగాల్సి వచ్చింది.

గొడవలొద్దని సూర్య బుజ్జగింపు
యాంకర్లపై మండిపడుతున్న అభిమానులను సూర్య బుజ్జగించారు. అనవరసరమైన విషయాలపై దృష్టిపెట్టకుండా సమాజంలో మంచి కోసం పనులు చేపడుదాం. ఈ అంశంపై క్షమాపణలు చెప్పే అంశాన్ని యాంకర్ల విచక్షణకే వదిలివేద్దాం అని సూర్చ నచ్చజెప్పారు.


Click it and Unblock the Notifications











