»   » అంతా షాక్: అభిమానుల కాళ్లు మొక్కిన హీరో సూర్య, ఏం జరిగింది?

అంతా షాక్: అభిమానుల కాళ్లు మొక్కిన హీరో సూర్య, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
అభిమానుల కాళ్లు మొక్కిన హీరో సూర్య.. ఏం జరిగింది?

సౌత్‌లో సినిమా హీరోలపై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువ. రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అజిత్, విజయ్, బాలకృష్ణ, సూర్య లాంటి స్టార్లకు కేవలం అభిమానులే కాకుండా భక్తులు కూడా ఉంటారు. తమ హీరోను దేవుడుగా భావిస్తారు, ఎదురుగా కనబడితే కాళ్లమీద పడిపోతారు. అలాంటి సంఘటనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే హీరో సూర్య స్పందించిన తీరు అందరూ షాకయ్యేలా చేసింది.

 సూర్య అలా చేయడంతో అంతా షాక్

సూర్య అలా చేయడంతో అంతా షాక్

సూర్య నటించిన ‘గ్యాంగ్' మూవీ తమిళంతో పాటు తెలుగులో విడుదలవ్వబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల తమిళనాడులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా సూర్య స్వయంగా అభిమానుల కాళ్లు మొక్కడంతో అంతా షాకయ్యారు.

ఏం జరిగింది

ఏం జరిగింది

‘గ్యాంగ్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుండగా కొందరు అభిమానులు సూర్యను కలవడానికి స్టేమీ మీదకు వచ్చారు. అయితే వారు వచ్చి రాగానే అందరూ సూర్య కాళ్లకు మొక్కడం మొదలు పెట్టారు. అయితే వెంటనే సూర్య వాళ్లందరి కాళ్లకు తిరిగి మొక్కడంతో అంతా ఆశ్చర్యపోయారు.

 ఏ హీరో ఇలా చేయలేదు

ఏ హీరో ఇలా చేయలేదు

చాలా మంది హీరోలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ ఏ హీరో కూడా తిరిగి అభిమానుల కాళ్లకు మొక్కలేదు. అయితే సూర్య ఇలా చేయడం వెనక చాలా అర్థం ఉందని, ఇంకోసారి ఎవరూ తన కాళ్లకు మొక్కకుండా ఉండేందుకే ఆయన ఇలా చేశారని అంటున్నారు.

 మీ తల్లిదండ్రులకు, గురువులకు పెట్టండి

మీ తల్లిదండ్రులకు, గురువులకు పెట్టండి

కాళ్లకు దండం పెట్టించుకునేంత గొప్పవాడిని తాను కాదని, కేవలం సినిమా నటుడిని..... కాళ్లు మొక్కించుకునే అర్హత కేవలం తల్లిదండ్రులు, గురువులు, మహనీయులకు మాత్రం ఉంటుందనేది హీరో సూర్య అభిప్రాయం. ఇలా చేయడం ద్వారా తన పట్ల మరోసారి ఎవరూ ఇలా ప్రవర్తించ వద్దని చెప్పకనే చెప్పారు సూర్య.

వీడియో వైరల్

అభిమానులు సూర్య కాళ్లు మొక్కడం, తిరిగి సూర్య వారి కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. మరి.

 గ్యాంగ్ విషయానికొస్తే...

గ్యాంగ్ విషయానికొస్తే...

సూర్య‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం `తానా సెంద కూట్ట‌మ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో యు.వి.క్రియేష‌న్స్ ‘గ్యాంగ్' అనే పేరుతో జ‌న‌వ‌రి 12న విడుదల చేస్తున్నారు. విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. ప్ర‌మోద్‌, వంశీ నిర్మాత‌లు.

 ‘స్పెషల్‌ 26'

‘స్పెషల్‌ 26'

అక్షయ్‌ కుమార్‌ అప్పట్లో హిందీలో ‘స్పెషల్‌ 26' అనే చిత్రం చేశారు. ఈ చిత్రానికి ‘గ్యాంగ్' రీమేక్ కాక పోయినా... ఈ సినిమా కాన్సెప్టుతో స్పూర్తి పొంది ‘గ్యాంగ్' చిత్రాన్ని రూపొందించారట. సౌత్ స్టైల్‌లో ఈ చిత్రం ‘స్పెషల్‌ 26'కు భిన్నంగా ఉండబోతోంది.

కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

రమ్యకృష్ణ ‘గ్యాంగ్‌' చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో రమ్యకృష్ణ సూర్యతో కలిసి లుంగి డ్యాన్స్‌ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు.

టాలీవుడ్లో మంచి మార్కెట్

టాలీవుడ్లో మంచి మార్కెట్

సూర్య సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తనకంటూ ఓ అభిమాన వర్గాన్ని సూర్య తెలుగు రాష్ట్రాల్లో ఏర్పరుచుకున్నారు. స్టూడియో గ్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary
Given that the fans in India worship film stars as demigods in their hearts and minds, fans seemingly wrestled with each other to touch Suriya's feet. In order to teach them a lesson, in a more humble way, he returned the gesture by touching the feet of his fans on the stage to everyone's surprise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X