»   »  విలన్ పాత్రలో వెంకటేష్?

విలన్ పాత్రలో వెంకటేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkatesh
ఫ్యామిలీ హీరోగా దూసుకుపోతున్న వెంకటేష్ కి ఆ సాఫ్ట్ పాత్రలు వేసి వేసి బోర్ కొట్టినట్లుంది. అందుకే విలన్ పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ చెప్పుకుంటున్నారు చెన్నై వాసులు. అదేంటి హీరో వెంకటేష్ విలన్ పాత్రలో కనపడ్డమేంటి కంగారుగా అని తెలుగు వాడొకడు తొందరపడ్డాడు. అప్పుడతను ...అసలు విషయం విశదీకరించాడు. వెంకటేష్ ఈ మధ్య కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్న మర్మయోగి సినిమాకు కమిటయ్యాడు తెలుసు కదా. దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు.

కమల్ హాసన్ వంటి మహా నటుడుతో కలసి పనిచేయటం చాలా గొప్పగా ఫీలవుతున్నాను. ఆయన దగ్గరనుంచి చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఆ సినిమాలో నేను గెస్ట్ గా చేయటం లేదు...పూర్తి రోల్ నే చేస్తున్నాను. నవంబర్ నుంచి ఈ షూటింగ్ కంటిన్యూగా జరుగుతుంది. అసలు మొదట సత్యరాజు ని ఈ సినిమా కోసం అడిగారు. కానీ ఆయన కమల్ తో నేను విలన్ రోల్స్ వేస్తున్న రోజుల్లో 'Kadami Kanniyam Kattupaadu సినిమాలో పాత్ర ఇచ్చి హీరోని చేసావు. ఇప్పుడు మళ్ళీ విలన్ ని చేయమంటున్నావు న్యాయమా అన్నాడు. అప్పుడు కమల్ నాకు ఈ రోల్ ఇచ్చాడు. అని చెప్పాడు కదా .అంటే సత్యరాజ్ వేయాల్సిన విలన్ పాత్రను వెంకటేష్ చేస్తున్నాడనే కదా. అంటే ఈ మర్మయోగి సినిమాలో వెంకీది నెగిటివ్ పాత్ర అనేగే అని తేల్చేసాడు. కరెక్టే కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X