For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోల్స్ రాయిస్ వివాదం.. విజయ్ వర్షన్ ఇదీ.. అసలు తప్పేంటి, అంత అవసరమా ?

  |

  నటుడు విజయ్ రోల్స్ రాయిస్ కార్ ఎంట్రీ టాక్స్ ఇష్యూ తమిళ నాడులో ప్రకంపనలు సృష్టించింది. ఎంట్రీ టాక్స్ విషయంలో విజయ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ, "సామాజిక న్యాయం కోసం తాము పోరాడుతున్నామని సినిమాల్లో ప్రతిబింబించే నటులు పన్ను మినహాయింపులు పొందకూడదని, నటీనటులు నిజమైన హీరోలుగా ఉండాలని, రీల్ హీరోలుగా ఉండకూడదని చెబుతూ విజయ్ రెండు వారాల్లో ప్రవేశ పన్ను చెల్లించాలని, ముఖ్యమంత్రి జనరల్ రిలీఫ్ ఫండ్‌కు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణ్యం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ ఈ వ్యవహారంలో విజయ్ తరపు నుంచి మొదటి స్పందన వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  అది సరికాదు

  అది సరికాదు


  ఈ విషయంలో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విజయ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. విజయ్ రియల్ హీరో అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే అసలు ఈ కేసులో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవడానికి ఒక తమిళ పత్రిక విజయ్ తరపు వారిని సంప్రదించారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత, విజయ్ న్యాయవాది ఎస్.కుమారసన్ సదరు తమిళ పత్రికతో మాట్లాడారు. ఇక కోర్టు తీర్పుపై చర్చించడం తప్పు అని మేము అనడం లేదన్న ఆయన కేసు ఏ ప్రాతిపదికన దాఖలు చేయబడిందో తెలియకుండా ఆయన మీద విమర్శలు వ్యాప్తి చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

  ఆ కేసు విషయంలో తీర్పు ఏంటంటే

  ఆ కేసు విషయంలో తీర్పు ఏంటంటే

  1999లో, విలియం ఫెర్నాండెజ్ కేరళ హైకోర్టులో ఎంట్రీ టాక్స్ కేసు పెట్టారు. అతని వాదన ఏమిటంటే, 'మేము పెద్ద మొత్తాన్ని దిగుమతి పన్నుగా చెల్లించిన తర్వాత, ప్రవేశ పన్ను పేరిట మరొక పన్ను అడగడం న్యాయం కాదు'. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకం విధించింది. కాబట్టి, ఆ వస్తువులకు ప్రవేశ పన్ను వర్తించదని పేర్కొందని అన్నారు. ఈ తీర్పును ప్రభుత్వం అంగీకరించలేదని, సుప్రీం కోర్టులో అప్పీల్ చేసిందని ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని పేర్కొన్నారు. విజయ్ ది కూడా అలాంటి ఒక కేసు, "అని కుమారసన్ అన్నారు.

  అసలు ఏమైంది అంటే

  అసలు ఏమైంది అంటే

  "2012 లో విజయ్ తరపున కేసును విచారించిన న్యాయమూర్తి పిబిఎస్ జనార్ధన రాజా 17.7.2012న షరతులతో కూడిన స్టే ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులుగా జారీ చేశారు. 20% ఎంట్రీ టాక్స్ చెల్లించి మీరు మీ వాహనాన్ని నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారని, దిగుమతి పన్ను మరియు ఇతర పన్నులుగా ఇప్పటికే 1,88,11,045 రూపాయలు చెల్లించిన విజయ్, తాత్కాలిక తీర్పు ఆధారంగా 23.07.2012 న 20 శాతం ప్రవేశ పన్ను చెల్లించిన తరువాత వాహనాన్ని నమోదు చేసి ఉపయోగించారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ కేసులో 2017 లో తీర్పు వెలువడిందని అన్నారు.

  వాళ్లకి అవగాహన లేకనే

  వాళ్లకి అవగాహన లేకనే

  ఇక 8.7.2021న మా కేసు విచారణకు వచ్చిందని అన్నారు. "మేము సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ప్రవేశ పన్నును చెల్లిస్తాము. మా కేసును ముగించండి 'అని మేము వాదించామని, అయితే, ఇలాంటి కేసును కొనసాగించడం తప్పు అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని, దీని గురించి పూర్తిగా తెలియని వారు కూడా బహిరంగంగా ఆ అభిప్రాయాలను మాత్రమే ఉంచుతూ విమర్శిస్తున్నారని అన్నారు.

  Narasimhapuram Movie Director Sriraj Balla Exclusive Interview | Filmibeat Telugu
  అప్పీల్ కి వెళుతున్నాం

  అప్పీల్ కి వెళుతున్నాం

  పన్నులు చెల్లించకూడదనే ఉద్దేశ్యం ఈ సందర్భంలో స్పష్టంగా లేదని, ప్రవేశ పన్నును వెంటనే కట్టాలని చెబితే విజయ్ ఎటువంటి అభ్యంతరం లేకుండా కట్టేవాడని అన్నారు. తీర్పులో ఉన్న అభ్యంతరాలపై మేము అప్పీల్ చేయబోతున్నామని, ఈ అప్పీల్ కూడా పన్నులు చెల్లించకపోవడం లేదా జరిమానాలు చెల్లించకపోవడం కోసం కాదని,అభ్యంతరకరమైన వ్యాఖ్యల గురించి అని అన్నారు. ఇలాంటి కఠినమైన వ్యాఖ్యలు చేయకూడదని మా వాదన అని పేర్కొన్న ఆయన దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు.


  English summary
  Vijay's lawyer S. Kumaresan spoke to a tamil daily. he revealed some intresting information about the case
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X