»   » తమిళ రాజకీయాల్లోకి విశాల్: అక్కడ ఫలితాన్ని శాసించేది తెలుగువారే

తమిళ రాజకీయాల్లోకి విశాల్: అక్కడ ఫలితాన్ని శాసించేది తెలుగువారే

Posted By:
Subscribe to Filmibeat Telugu
RK Nagar By Poll : This Actor Also Will Contest | Oneindia Telugu

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్‌కె నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఎన్నికల నోటిఫికేషన్

ఎన్నికల నోటిఫికేషన్

గతంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఆ సమయంలో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికలను వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

నటుడు విశాల్‌

నటుడు విశాల్‌

తమిళనాట అధికార, విపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగువాడైన యువ నటుడు విశాల్‌ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఫలితాన్ని శాసించేది తెలుగువారే. దీంతో ఇక్కడి నుంచి విశాల్‌ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అన్నాడీఎంకే తరఫున

అన్నాడీఎంకే తరఫున

ఇక్కడ అన్నాడీఎంకే తరఫున తెలుగువాడైన ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ ఈ మధుసూదన్‌, డీఎంకే తరఫున మరుదుగణేశ్‌, స్వతంత్య్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌ శుక్రవారం నామినేషన్లు వేశారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమైనందున డీఎంకే అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

అధికారికంగా

అధికారికంగా

అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా విశాల్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనే విషయాలపై విశాల్ ‌ ఏ రకంగా స్పందిస్తారోననేది ఆసక్తిగా మారింది. అందుకే విశాల్‌ను రంగంలోకి దింపాలని దినకరన్‌ గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. విశాల్‌ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను ఖండించారు.

English summary
RK Nagar by-poll scheduled to happen on December 21st is the hot topic everywhere. The reports of Tamil actor Vishal contesting the by-election as an independent created a sensation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu