twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ కోసం రియల్ హీరోగా మారిన విశాల్.. కాలా కోసం వారికి వార్నింగ్

    By Rajababu
    |

    అభిమన్యుడు చిత్రంతో విజయాన్ని అందుకొని మంచి జోష్ మీదున్న విశాల్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పైరసీపై పోరాటం చేస్తున్న ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం రియల్ హీరోగా మారారు. కాలా చిత్ర పైరసీని అడ్డుకోవడమే కాకుండా అందుకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్ట్ చేయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    Recommended Video

    Kaala Movie Public Talk కాలా మూవీ పబ్లిక్ టాక్
    కాలా పైరసీపై ఉక్కుపాదం

    కాలా పైరసీపై ఉక్కుపాదం

    శుక్రవారం (జూన్ 7వ తేదీన) రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా పైరసీదారులపై విశాల్ దృష్టిపెట్టారు. సింగపూర్‌లో తలైవా అభిమాని పైరసీకి పాల్పడుతున్న విషయాన్ని పసిగట్టిన విశాల్‌తో కూడిన ఓ బృందం వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు పైరసీదారుడిని అరెస్ట్ చేశారు.

    ఫేస్‌బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్

    ఫేస్‌బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్

    తమిళ చిత్ర పరిశ్రమకు కాలా చిత్రం ఎంతో ముఖ్యమైనది. రెండేళ్ల తర్వాత రజనీకాంత్ కాలాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దానిని పైరసీ బారిన పడకుండా చేయాలని నిర్ణయించాం. సింగపూర్‌లోని క్యాథే మల్టీప్లెక్స్‌లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌కు పాల్పడినట్టు మా బృందానికి సమాచారం అందింది. దాంతో వెంటనే సరైన చర్యలు తీసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నాం అని విశాల్ తెలిపారు.

    40 నిమిషాలపాటు కాలా లైవ్

    సింగపూర్ క్యాథే థియేటర్‌లో ఆ వ్యక్తి దాదాపు 40 నిమిషాలు ఫేస్‌బుక్ ద్వారా సినిమాను లైవ్‌గా ప్రసారం చేశారు. ఇతర దేశంలో ఈ డిజిటల్ క్రైమ్ చేయడంతో దానిని ట్రాక్ చేయడానికి చాలా శ్రమించాం. అధికారులు సహకరించడంతో పైరసీని అడ్డుకోవడంలో సఫలమయ్యాం అని విశాల్ బృందం సభ్యులు పేర్కొన్నారు.

    సైబర్ నేరగాళ్లకు హెచ్చరిక

    సైబర్ నేరగాళ్లకు హెచ్చరిక

    సింగపూర్‌లో పైరసీని అడ్డుకొని తాము ఎలాంటి చర్యలు చేపడుతున్నామనే విషయాన్ని సైబర్ నేరగాళ్లకు హెచ్చరిక చేశాం. చాలా మంది సినిమాలోని సీన్లను, పాటలను ఫోన్‌లో రికార్డు చేయడాన్ని చాలా తేలికగా తీసుకొంటారు. కానీ అది సైబర్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. పైరసీ చాలా కఠినమైన నేరం. అందుకే సినీ పరిశ్రమను కాపాడేందుకు చాలా కఠినమైన చర్యలు తీసుకొంటున్నాం అని వారు వెల్లడించారు.

    English summary
    Vishal Krishna, who heads Tamil Nadu Films Producers’ Council, helped avert a major crisis after they got a man in Singapore arrested for live-streaming Kaala on Facebook. “We got the man arrested after he had streamed 40 minutes of Kaala on Facebook. The important thing was to take action without delay. That we managed to do.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X