నిర్మాతగా మారిన అమలా పాల్.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అభినందన

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఇప్పటి వరకు నటిగానే తెలుసు. అయితే త్వరలోనే కొత్త అవతారం ఎత్తబోతున్నారు. హీరోయిన్‌గా గ్లామర్, ఫీల్‌గుడ్, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. అలాంటి హీరోయిన్ త్వరలోనే నిర్మాతగా మారనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమలాపాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ట్విట్టర్‌లో తాజాగా అమలా పాల్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. నేను 12 సంవత్సరాలు, 144 నెలలు, 4380 రోజులుగా ఇండస్ట్రీలో నటిగా ఉన్నాను. ఈ 12 ఏళ్లలో నేను ఎన్నో అనుభూతులను, రివార్డులను అందుకొన్నాను. ఇప్పుడు మీకు ఘనమైన వార్తను అందించడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ట్వీట్ చేసింది.

Actress Amala Paul turns as Producer for Cadaver movie

నేను కడవేర్ అనే సినిమా ద్వారా నిర్మాతగా మారుతున్నాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన విధంగానే నిర్మాతగా నా ప్రయాణంలో సహకారం అందిస్తారని అనుకొంటున్నాను. కడవేర్ ఫోరెన్సిక్ థ్రిల్లర్. నేను పోలీస్ సర్జన్‌గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను అని తెలిపారు.

అమలాపాల్ ట్వీట్ చేసిన వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కంగ్రాట్స్ అంటూ విషెస్ అందజేశారు. దాంతో అక్షయ్ కుమార్ విషెస్ స్పందిస్తూ.. నేను అక్షయ్ కుమార్ నటనకు బిగ్ ఫ్యాన్. ఫిట్‌నెస్ కోసం ఆయన తీసుకొనే శ్రద్ద నాకు స్పూర్తిని నింపుతుంది. అలాంటి వ్యక్తి తెలిపిన అభినందనలకు హ్యాపీగా, గర్వంగా ఉంది.

ఇదిలా ఉంటే... ప్రస్తుతం నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రానున్న ది ఘోస్ట్ చిత్రంలో అమలా పాల్ నటిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల కాజల్ అగర్వాల్ తప్పుకోవడంతో అమలాపాల్ ఆ స్థానంలో తీసుకొన్నారు. త్వరలోనే నాగ్‌తో కలిసి షూటింగులో పాల్గొననున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X