»   » ఐటం గర్ల్ 'బాబిలోనా' వివాహం (ఫొటోలు)

ఐటం గర్ల్ 'బాబిలోనా' వివాహం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మరో నటి పెళ్లి కూతురుగా పీట ఎక్కింది. అందాల ఆరబోతతో దక్షిణాది చిత్ర పరిశ్రమను కట్టిపడేసి... తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది నటి బాబిలోనా. ఈమె ఓ పారిశ్రామికవేత్తను బుధవారం వివాహమాడారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'తై పిరందాచ్చు' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన బాబిలోనా తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి. ఇదిలా ఉండగా కొన్నేళ్ల కిందట చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త సుందర్‌పాబుల్‌ రాజు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకారం తెలిపడంతో ఇటీవల నిశ్చితార్థం జరిగింది.

ఆ ప్రకారం బుధవారం ఉద యం స్థానిక వడపళినిలో గల నక్షత్ర హోటల్‌లో నటి బాబిలోనాకు సుంద ర్ బాబుల్ రాజుకు క్రిస్టియన్ మత సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఫాదర్ ఎబినేశర్ సమక్షంలో వధూవరుల అంగీకారంతో ఉంగరా లు తొడిగించి వివాహం జరిపించారు.

ఈ వివాహ వేడుకకు చెన్నై థియేటర్స్ సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్,నల్లమ్మైదంపతులు,దర్శక నిర్మాత రుక్మాంగధర్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి నవ వధూవరులను ఆశీర్వదించారు.

తెలుగు అమ్మాయే...

తెలుగు అమ్మాయే...

ఒక రకంగా మాదీ తెలుగు కుటుంబమే. మేం క్షత్రియులం. అయితే పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అన్నారామె.

తల్లి,తండ్రి

తల్లి,తండ్రి

అమ్మ దేవి గృహిణి. నాన్న బాబూ నారాయణరావ్‌ ఫిల్మ్‌ ఎడిటర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. మేం నలుగురం సంతానం. నేను, అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్లు.

కుటుంబమంతా సినిమా ఫీల్డే...

కుటుంబమంతా సినిమా ఫీల్డే...

బాబిలోనా మాట్లాడుతూ...మా అమ్మమ్మ చాలామంది హీరోయిన్‌లకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌, సలహాదారు. పెద్దమ్మ సీనియర్‌ నటి సుచిత్ర. ఆమె 250 సినిమాలకు పైగా చేశారు. మలయాళంలో ఫేమస్‌ హీరోయిన్‌. నాన్న కూడా సినీరంగమే. పెద్ద నాన్న సాయిబాబా కాస్ట్యూమ్‌ డిజైనర్‌. ఇలా కుటుంబమంతా సినీరంగంతో సంబంధాలున్నవారే.

తొలి సినిమా...

తొలి సినిమా...

మలయాళ డైరెక్టర్‌ ప్రేమ్‌ నన్ను చూసి ‘ సినిమాల్లో నటిస్తావా?' అని అడిగారు. అప్పటికి నా వయసు 13 ఏళ్లు. మా ఇంట్లోవారితో కూడా ఆయన మాట్లాడారు.

ఐటం సాంగ్ అని

ఐటం సాంగ్ అని

అంతా తర్జనభర్జనలు పడిన తరువాత ఆ సినిమాలో - ఐటమ్‌సాంగ్‌ అని తెలిసి అందరూ వద్దన్నారు. నాకేమో వయసు తక్కువ. అది కూడా తొలి సినిమా ఐటమ్‌సాంగ్‌ కావడంతో ఒప్పుకోలేదు. మా పెద్దమ్మ కూడా వద్దనే సలహా చెప్పింది. కానీ మా అమ్మమ్మ మాత్రం ‘వెతుక్కుంటూ వచ్చిన అవకాశం. దేవుడే పంపివుంటాడు. ఎందుకు వదిలేయాలి? చేయాల్సిందే' అని పట్టుబట్టింది.

అందుకే చేసా

అందుకే చేసా

నేను మా అమ్మమ్మ వద్దే పెరిగాను. ఆమే నాకు అన్నీను. ఆమె మాటంటే నాకు వేదవాక్కు. మా కుటుంబంలోనూ అంతే. దాంతో నేను ఆ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా చాలామంది అలాంటి పాత్ర ఎందుకు చేశావంటూ తిట్టారు. 1999లో విడుదలైన ఆ సినిమా పేరు ‘చార్లీచాప్లిన్‌'. అది హిట్టవ్వడంతో నాకు కూడా మంచి పేరు, గుర్తింపు వచ్చాయి.

తెలుగులో ...

తెలుగులో ...

‘మొండిమొగడు - పెంకి పెళ్లాం', ‘దొంగసచ్చినోళ్లు' పేరు తెచాయి. మొత్తం యాభైకి పైగ సినిమాలు చేశాను.

 మొదటి పెళ్లి

మొదటి పెళ్లి

నిజానికి బాబిలోనాకు అప్పట్లో అర్జున్ దాస్ అనే వ్యక్తి తో పెళ్ళైందని మీడియాలో వచ్చాయి. అయితే అదంతా అబద్దం అని ఆ తర్వాత తేలింది.

English summary
Popular glamour actress Babilona - Industrialist Sundar Babul Raj marriage was held in Chennai .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu