»   » పడక గదికి రమ్మని పిలవటం నిజమే, ఆ హీరోనే నన్ను తొక్కేసారు : సీనియర్‌ నటి

పడక గదికి రమ్మని పిలవటం నిజమే, ఆ హీరోనే నన్ను తొక్కేసారు : సీనియర్‌ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది కాలంగా సౌతిండియాలో పెరిగిపోతున్న కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై నటీ నటులు నోరు విప్పుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పటానికి జంకటం లేదు. ముఖ్యంగా నటీమణులపై లైంగిక వేధింపులపై ఇటీవల మీడియాలో కథలు కథలుగా కథనాలు ప్రచారం జరుగుగుతున్నాయి.

రీసెంట్ గా అడ్జెస్ట్‌మెంట్‌ తప్పదంటూ ఇండస్ట్రీలో వేధింపులు గురించి నటి రెజీనా, ఒక ఛానల్‌ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ నటి సంధ్య ఇలా ఇటీవల పలువురు హీరోయిన్స్ ఛేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

తాజాగా మరో సీనియర్‌ నటి కస్తూరి తాను అలాంటి బాధితురాలినేనని చెప్పారు. అంతే కాదు అవకాశాల పేరుతో పడక గదికి రమ్మనే అలవాటు సినిమ పరిశ్రమలో ఉందనే విషయాన్ని తేల్చి చెప్పారు. కస్తూరి వంటి సీనియర్ నటి ఇలా చెప్పటంతో ఇండస్ట్రీ మొత్తం అవాక్కయ్యి చూసింది. ఇంతకీ కస్తూరి ఏమి చెప్పింది. ఏ హీరోపై ఆరోపణలు చేసిందో చూద్దాం.

 ఓ హీరో వల్లే

ఓ హీరో వల్లే

ఒక్కప్పుడు బిజీ హీరోయిన్ గా రాణించిన నటి కస్తూరి.ఆ తరువాత అమెరికాకు చెందిన డాక్టరును పెళ్లాడి అక్కడే సెటిల్‌ అయ్యారు. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. తెలుగు,తమిళ భాషల్లోనూ ఆమెకు ఇప్పుటికీ అబిమానులు ఉన్నారు. దానితో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనమయ్యీయి. ఆమె ఓ హీరోవల్ల తన కెరీర్ కోల్పోయానని అన్నారు.

పడక గదికి

పడక గదికి

కూతురికి డాన్స్ నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొంటూ అవకాశాల పేరుతో హీరోయిన్స్ ను పడక గదికి రమ్మనే అలవాటు సినిమా పరిశ్రమలో ఉందని అన్నారు.

అవకాశాలు కోల్పోతారు

అవకాశాలు కోల్పోతారు

అలాగే కొందరు హీరోయిన్స్ ఆలోచనా రాహిత్యంతో మాట్లాడి, ఇబ్బందుల్ల పడతారు. మరికొందరు రెమ్యునేషన్ తో డిమాండ్‌తో అవకాశాలను కోల్పోతారు. ఇంకొందరు సరైన నిర్ణయం తీసుకొవడంతో ఫెయిల్‌ అయ్యి నటిగా ఎదగలేకపోతారని అన్నారు.

నో చెప్పటం ఇష్టపడని హీరో

నో చెప్పటం ఇష్టపడని హీరో

ఇక తన విషయంలో తాను ఆశించింది జరగకపోవడంతో తనను చిత్రాల నుంచి తొలగించారని చెప్పారు. అదీ ఒక హీరో కారణంగానే జరిగిందన్నారు. ఇప్పుడా హీరో రాజకీయవాదిగా ఉన్నారని చెప్పారు. ఆయనకు ఈగో అధికం అని తాను భావిస్తానన్నారు. అయినా తానా హీరోను గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు.

కోపం ప్రదర్శించేవాడు

కోపం ప్రదర్శించేవాడు

ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్‌ సమయంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని తెలిపారు. ఆ తరువాత ఆయన రెండు చిత్రాల నుంచి తనను తప్పించారని చెప్పారు అన్న కస్తూరి ఆ నటుడెవరన్నది మాత్రం చెప్పలేదు.

ఆసక్తిగా చూస్తోంది

ఆసక్తిగా చూస్తోంది

కస్తూరి ఒక్క తమిళంలోనే కాకుండా పలు భాషా చిత్రాల్లో నటించారు. నటి కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో అని తమిళ పరిశ్రమ, మీడియా ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ కస్తూరి చేసిన సినిమాలు గుర్తు వచ్చాయా...అన్నమయ్య, భారతీయుడు.

చిరంజీవితో

చిరంజీవితో

అలాగే కస్తూరి మాట్లాడుతూ కమల్‌తో నటించడమంటే ఎంతో భాగ్యం చేసుకున్నట్లుగా భావిస్తున్నానని చెప్పింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.

వస్తుందనుకోవటం లేదు

వస్తుందనుకోవటం లేదు

ఇక తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించే అవకాశం తనకు దక్కలేదని, ఆ అవకాశం ఇకపై వస్తుందని కూడా తాను భావించడం లేదని వ్యాఖ్యానించింది. కాగా, 'భారతీయుడు' చిత్రంలోని ‘పచ్చని చిలుకలు తోడుంటే..' అనే పాటలో కమల్‌తో ఆడిపాడే కస్తూరిగా ప్రేక్షకుల మదిలో ఆమె గుర్తుండిపోయింది.

English summary
Recently, Actress Kasthuri talked about casting couch, which is a familiar term for the film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu