హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఖరారు

ఆపై పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిపోయింది. తెరపై కనిపించి దాదాపు తొమ్మిదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆమెకు మరోసారి సినీ పిలుపు లభించింది. విలక్షణ దర్శకుడు బాలా తన కొత్త చిత్రంలో కీలకపాత్రలో నటించాలంటూ సందేశం పంపారట. ఆ పాత్ర ఏమిటన్న విషయం మాత్రం చెప్పలేదట.
ఇక ఈ మధ్యన సిమ్రాన్, జ్యోతిక వంటి అప్పటి హీరోయన్స్ అంతా మళ్ళీ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. అదే రూటూలో లైలా కూడా ప్రయాణం పెట్టుుకుంది. ఇక రవితేజ సరసన షాక్ లో నటించిన జ్యోతిక ..వివాహానంతరం వెండి తెరకు దూరమైంది. అయితే ఆమె త్వరలో రీఎంట్రీ ఇవ్వనుంది. ఇన్నాళ్లూ పిల్లలు పెద్దవాళ్లు కాలేదని ఆగిన జ్యోతిక తన భర్త అనుమతితో ...తన ఖాళీ సమయాన్ని రీ ఎంట్రీతో సద్వినియోగం చేసుకోనుంది.


Click it and Unblock the Notifications











