twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చనిపోలేదు, క్షేమం: సీనియర్ నటి మీడియా ప్రకటన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి మనోరమ చనిపోయినట్లు ఇటీవల తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఖండిస్తూ మనోరమ మీడియా ప్రకటన విడుదల చేసారు. తాను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్టుల ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మనోరమ సినిమా జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెలితే...
    మనోరమ ఎంజీఆర్, ఎన్‌టీఆర్, శివాజీగణేశన్, ఏఎన్ఆర్‌ల నాటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఆ మధ్య శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో స్నానాల గదిలో జారిపడిన తరతలకు గాయమైనప్పటి నుండి ఆమె ఆరోగ్యం బావుండటం లేదు. తర్వాత మోకాళ్లకు శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావడంతో కొంత కాలం సినీ పరిశ్రమకు దూరమైంది. కోలుకున్న తర్వాత పలు సినిమాల్లో నటించారు.

    Actress Manorama is Alive

    మనోరమ సుమారు 1500 సినిమాలు మరియు 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో నటించినది. కొన్ని మళయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు.

    1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. తెలుగులో భద్రకాళి, శుభోదయం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, రిక్షావోడు, బావ నచ్చాడు, కృష్ణార్జున, అరుంధతి వంటి చిత్రాలలో కనిపించి అలరించారు.

    Read more about: manorama మనోరమ
    English summary
    Actress Manorama is healthy and alive, kindly do not trust any rumours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X