»   » 'చంపేస్తా' జైల్లో ఉన్న రౌడి బెదిరింపు, పోలీసులతో నటి రాధ, అక్రమ సంభంధమే కారణం?

'చంపేస్తా' జైల్లో ఉన్న రౌడి బెదిరింపు, పోలీసులతో నటి రాధ, అక్రమ సంభంధమే కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'సుందర్ ట్రావెల్స్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రాధ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. సోమవారం నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో తనకు ప్రాణహాని వుందని, పోలీసు భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా తనను వైరం అనే రౌడి షీటర్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఆ ఆడియోని సైతం విడుదల చేసింది. మీకు తమిళం వచ్చి ఉంటే ఈ ఆడియోని వినవచ్చు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పుళల్‌ జైలులో బందీగా వున్న వైరం అనే రౌడీషీటర్‌ తనను హత్య చేస్తానని సెల్‌ఫోన్‌లో బెదిరించాడని, సెల్‌ఫోన్ బెదిరింపు ఆడియోను కూడా కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించినట్లు తెలిపారు.

నటి రాధకు నా భర్తతో అక్రమ సంబంధం,ఆయన్ను నాకు ఇప్పించండి

అలాగే ..స్థానిక కోడంబాక్కంకు చెందిన మునివేల్‌ అనే అన్నాడీఎంకే నాయకుడిని తాను కిడ్నాప్‌ చేసినట్లు ఆయన భార్య కామాక్షి తనపై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆ రౌడి భార్య కూడా మీడియా ముందుకు వచ్చి రివర్స్ ట్విస్ట్ ఇచ్చింది.

రౌడీ షీటర్ వైరం 2014 నుంచి జైలులో ఉన్నారు. అతని మీద డజను దాకా కేసులు ఉన్నాయి. రెండు మర్డర్ కేసులు సైతం ఉన్నాయి. వైరం మాట్లాడాడు అని చెప్పబడుతున్న వాయిస్ జైలులో ఉండి మాట్లాడిందే అని రాద చెప్తోంది. ఆదివారం సాయింత్రం ఆరు గంటలకు తనకు వార్నింగ్ వచ్చిందని, తను మరసటి రోజు పోలీస్ కేసు పెట్టానని చెప్పింది.

ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ...కేసుల్లో ఉన్న ఓ వ్యక్తి జైలులో నుంచి సెల్ ఫోన్ లో మాట్లాడటం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పారు. మరో ప్రక్క వైరం భార్య లీనా ..తన భర్తపై రాధ తప్పడు కేసులు పెడుతోందని, తప్పుడు ప్రచారం చేస్తోందని కంప్లైంట్ చేసి ఈ కేసు మరో ట్విస్ట్ ఇఛ్చింది.

అసలు గొడవేంటి అనే విషయాలు స్లైడ్ షోలో...

కాల్ చేసాడు

కాల్ చేసాడు

ఈనెల 18వ తేదీన తనకు కాల్‌ చేసిన వైరం అనే రౌడీ షీటర్‌ మునివేల్‌తో ఉన్న సంబంధాలను వదులుకోవాలని చెప్పారు

లేకుంటే...

లేకుంటే...

శవమై పోతావని హెచ్చరించాడని, అతని వల్ల ప్రాణహాని వున్నందువల్ల తనకు పోలీసు భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరినట్టు ఆమె తెలిపారు.

ఇదిలా వుండగా...

ఇదిలా వుండగా...

రౌడీ షీటర్‌ వైరం భార్య లీనా విలేఖరులతో మాట్లాడుతూ, రాధను బెదిరించింది తన భర్త కాదన్నారు.

ఆయన పేరుతో...

ఆయన పేరుతో...

తన భర్త పేరుతో సెల్‌ఫోన్‌లో మరెవరో మాట్లాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలసిందిగా తాను కూడా పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

భర్తకు ముప్పు

భర్తకు ముప్పు

రాధ వల్ల తన భర్త తనను వదిలేసి కన్పించకుండా వెళ్లిపోయాడని ఉమాదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది.

కార్యకర్త

కార్యకర్త

చెన్నైకి చెందిన మునివేల్‌ అనే వ్యక్తి ఏఐఏడీఎంకే కార్యకర్త.

సన్నిహితంగా

సన్నిహితంగా

మునివేల్ తమిళ నటి రాధ(సుందర ట్రావెల్స్‌ తదితర చిత్రాల్లో నటించింది)తో సన్నిహితంగా ఉంటున్నాడని, అందుకే తనను వదిలేశాడని ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గతంలోనూ

గతంలోనూ

ఇంతకుముందు ఇదే విషయమై విరుగంబాక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారామె.

హెచ్చరించారు

హెచ్చరించారు

అప్పుడు పోలీసులు ఇద్దరినీ పిలిచి హెచ్చరించారని చెప్పింది. .

రాధ వేధింపులు

రాధ వేధింపులు

అయినా రాధ తమను వేధించడం మానలేదని చెప్పంది

నిరంతరం ఫోన్స్

నిరంతరం ఫోన్స్

తన భర్తకు నిరంతరం ఫోన్లు చేస్తూనే ఉందని కంప్లైంట్ చేసింది ఉమాదేవి

అంతేకాకుండా

అంతేకాకుండా

తనకి కూడా ఫోన్‌ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడిందని ఉమాదేవి ఫిర్యాదులో పేర్కొంది.

కాలేజీ మానేసింది

కాలేజీ మానేసింది

రాధ బెదిరింపులకు భయపడి తన కుమార్తె కాలేజీకి కూడా వెళ్లడంలేదని చెప్పారామె.

కనిపించటం లేదు

కనిపించటం లేదు

ఇప్పుడు తన భర్త రెండు రోజులుగా కన్పించడంలేదని వివరించింది.

వెతకించమని

వెతకించమని

తన భర్తని వెతికించమని ఉమాదేవి కమిషనర్‌ టీకే రాజేంద్రన్‌ను కోరింది.

మరోపక్క ...

మరోపక్క ...

ఉమాదేవి భర్త కన్పించకుండా పోవడానికి నటి రాధకు ఎలాంటి సంబంధంలేదని రాధ సన్నిహితులు చెప్తున్నారు.

కంప్లైంట్ లో

కంప్లైంట్ లో

తన భర్త మునివేల్ సుందరాట్రావెల్స్ చిత్ర హీరోయిన్ రాధతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది.

మహిళా పోలీస్ స్టేషన్ లోనూ

మహిళా పోలీస్ స్టేషన్ లోనూ

ఈ విషయమై తాను స్థానిక విరుగమ్‌బాక్కమ్, టీ.నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పేర్కొంది.

అప్పుడు...

అప్పుడు...

మహిళా పోలీస్ స్టేషన్ వారు... తన భర్తను, నటి రాధను పిలిపించి విచారించి అనంతరం తన భర్తను తనతో పంపించార ని తెలిపింది.

సంతోషం దూరం

సంతోషం దూరం

అయితే అప్పటి నుంచి నటి రాధ తన భర్తకు తరచూ ఫోన్ చేస్తూ తమ కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తోందని చెప్పుకొచ్చింది.

పిర్యాదులో

పిర్యాదులో

నటి రాధ నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని, తన భర్తను ఆమె బారి నుంచి విడిపించి తనకు అప్పగించాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొంది.

ఈ కంప్లైంట్ ను

ఈ కంప్లైంట్ ను

ఈ ఫిర్యాదును టీ.నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పంపారు. వారు దీన్ని డీల్ చేస్తారు.

అవకాసం

అవకాసం

దీంతో అక్కడి పోలీసులు ఒకటి రెండు రోజుల్లో నటి రాధను పిలిపించి విచారించే అవకాశం ఉంది.

తననే మోసం

తననే మోసం

నటి రాధ ఇంతకు ముందొకసారి తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిందన్నది గమనార్హం.

చంపేస్తాడు

చంపేస్తాడు

తన భర్త చాలా మంచివాడని , ఆయన్ను చంపేస్తుందేమో అని భయం గా ఉందని తెలియచేసింది.

పోలీసులు

పోలీసులు

ఈ కేసు విషయమై కూలంకషంగా తేల్చి చూస్తామని పోలీసులు చెప్తున్నారు.

English summary
A small time actor Radha claimed that a history-sheeter named Vairam alias Kundrathur Vairam made a threat call to her from inside Puzhal Prison.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu