For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వ్యభిచారం కేసులో ఇరికించి జీవితం నాశనం చేయాలని హీరోయిన్ పై కుట్ర

  By Srikanya
  |

  చెన్నై: తనను వ్యభిచారం కేసులో ఇరికించి రోడ్డుపై పెట్టేందుకు తన మాజీ భర్త కుట్ర పన్నుతున్నారని సుందరం ట్రావెల్స్ రాధ కంప్లైంట్ చేసారు. గత కొద్ది రోజులుగా రోజుకో వివాదంతో ఆమె పేరు మారు మోగుతోంది. ఈ నేఫధ్యంలో ఈమె ఈ కొత్త ఆరోపణ మీడియాలో హెలెట్ అయ్యింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే.. నన్ను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించడానికి నా మాజీ భర్త కుట్ర పన్నుతున్నాడని నటి రాధ పోలీస్ లకు వద్దకు వెళ్లి కంప్టైంట్ చేసారు.సుందరా ట్రావెల్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ. ఇప్పటికే పలు మార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈమె ఇటీవల మరో సారి వార్తల్లోకెక్కి కలకలం సృష్టిస్తున్నారు.

  Also Read : నటి రాధకు నా భర్తతో అక్రమ సంబంధం,ఆయన్ను నాకు ఇప్పించండి

  ఇక సోమవారం నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో తనకు ప్రాణహాని వుందని, పోలీసు భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా తనను వైరం అనే రౌడి షీటర్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఆ ఆడియోని సైతం విడుదల చేసింది.

  అలాగే తాను ఇప్పటికి నాలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ అలియాస్ పైసల్ అనే వ్యక్తితో పరిచయమైందని, అది ప్రేమగా మారడంతో 2008 నుంచి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని తెలిపారు. అయితే శ్యామ్‌కు పలువురు అమ్మాయిలలో సంబంధం ఉందని తెలియడంతో తాను ఆయన నుంచి విడిపోయానని వివరించారు.

  కుట్ర వెనక ఏం జరిగిందో రాధ చెప్పిన విషయాలు స్లైడ్ షోలో ..

  ఐదు లక్షలు అప్పు

  ఐదు లక్షలు అప్పు

  తన తల్లి సైదాపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తికి ఐదు లక్షలు అప్పు ఇచ్చారని,అతను ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని చెప్పారు. తాను వెళ్లి అడగ్గా సరిగా సమాధానం చెప్పకుండా దుర్భాషలాడాడని తెలిపారు. ఇదే గొడవకు మూలం అన్నారు

  మాజీ భర్తను కోరాను

  మాజీ భర్తను కోరాను

  దీంతో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన అతని నుంచి తన డబ్బు తిరిగి ఇప్పించేలా చేయమని తన మాజీ భర్తను కోరానన్నారు.

  అక్కడికి వెళ్లా

  అక్కడికి వెళ్లా

  ఇటీవల ఆయన ఫోన్ చేసి కేకే.నగర్‌కు రా నీ డబ్బు ఇప్పిస్తానని చెప్పడంతో తాను అక్కడికి వెళ్లానన్నారు.

  మనివేల్ ఉన్నారు

  మనివేల్ ఉన్నారు

  అక్కడ అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కమ్ డివిజన్ ఉపకార్యద ర్శి మునివేల్ ఉన్నారని తెలిపారు. ఆయన తనతో తనను గుర్తు పట్టలేదా అని అడిగారన్నారు. మీరు నడిగర్ సంఘంలో డాన్స్ శిక్షణకు వచ్చినప్పుడు పరిచయం అయ్యాం అని చెప్పారన్నారు.

  అప్పుడప్పుడూ

  అప్పుడప్పుడూ

  ఆ తరువాత అప్పుడప్పుడూ మునివేల్ తన ఇంటికి వస్తుండేవారని చెప్పారు.

  నచ్చకే వ్యభిచార కేసు

  నచ్చకే వ్యభిచార కేసు

  అది నచ్చని తన మాజీ భర్త శ్యామ్ మునివేల్ భార్యతో ఐదు లక్షలు ఇస్తాను రాధను వ్యభిచార కేసులో అరెస్ట్ అయ్యేలా చెయ్యి అని చెప్పారు

  మునివేల్ తెలిపాడు

  మునివేల్ తెలిపాడు

  వ్యభిచారంలో ఇరికించమనే వ ఈ విషయాన్ని తనకు మునివేల్ తెలిపారని రాధ పేర్కొన్నారు.

  కిడ్నాప్

  కిడ్నాప్

  కాగా తన భర్తను డిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కం డివిజన్ ఉప కార్యదర్శి భార్య ఉమాదేవి నటి రాధపై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

  ఇంకో ట్విస్ట్

  ఇంకో ట్విస్ట్

  పుళల్ జైలులో ఉన్న వైరమ్ అనే ఖైదీ తనను ఫోన్‌లో బెదిరించినట్లు ఆడియో టేపును బయట పెట్టి రాధ సోమవారం తనకు రక్షణ కావాలని కోరుతూ పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

  మరో ప్రక్క

  మరో ప్రక్క

  అంతేకాకుండా ఉమాదేవి తన భర్త, నటి రాధల రహస్య సంభాషణలను బయట పెట్టి కలకలం రేపారు.

  పర్శనల్ మ్యాటర్

  పర్శనల్ మ్యాటర్

  అయితే దీనిపై స్పందించిన నటి రాధ అది తన వ్యక్తిగత విషయం అని పేర్కొనడం గమనార్హం.

  పోలీసులు ఏమంటారంటే

  పోలీసులు ఏమంటారంటే

  పుళల్ జైలులో ఉన్న ఖైది వైరమ్ మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, తను నటి రాధను బెదిరించి ఉంటాడని పోలీసులు నమ్ముతున్నారు. ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.

  చర్యలు

  చర్యలు

  వైరమ్ గురించి బలమైన ఆధారాలు లభిస్తే అతనిపై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపారు.

  ఖండించింది

  ఖండించింది

  నటి రాధ తనను ఖైదీ వైరమ్ ఫోన్‌లో బెదిరించారన్న ఆరోపణలను వైరమ్ భార్య లీనా ఖండించింది.

  ఇంకెవరో

  ఇంకెవరో

  తన భ ర్త పేరుతో ఎవరో బెదిరించి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది.

  వీళ్లందరి పిర్యాదులపై

  వీళ్లందరి పిర్యాదులపై

  నటి రాధ, కోడంబాక్కం డివిజన్ ఉపకార్యదర్శి భార్య ఉమాదేవి, ఖైదీ వైరమ్ భార్య లీనా ఫిర్యాదులపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

  అబద్దం

  అబద్దం

  మునివేల్‌ ని తాను కిడ్నాప్‌ చేసినట్లు ఆయన భార్య కామాక్షి తనపై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

  రౌడీ షీటర్

  రౌడీ షీటర్

  రౌడీ షీటర్ వైరం 2014 నుంచి జైలులో ఉన్నారు. అతని మీద డజను దాకా కేసులు ఉన్నాయి. రెండు మర్డర్ కేసులు సైతం ఉన్నాయి. వైరం మాట్లాడాడు అని చెప్పబడుతున్న వాయిస్ జైలులో ఉండి మాట్లాడిందే అని రాద చెప్తోంది.

  పోలీసులు ఏమంటారంటే

  పోలీసులు ఏమంటారంటే

  ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ...కేసుల్లో ఉన్న ఓ వ్యక్తి జైలులో నుంచి సెల్ ఫోన్ లో మాట్లాడటం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పారు.

  భర్తకు ముప్పు

  భర్తకు ముప్పు

  రాధ వల్ల తన భర్త తనను వదిలేసి కన్పించకుండా వెళ్లిపోయాడని ఉమాదేవి మహిళ పోలీసులను ఆశ్రయించింది.

  English summary
  Radha, a cinema actress, filed a cheating complaint on Friday against a man whom she charged with living with her for nearly six years promising to marry her and deserting her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X