»   » స్టార్ హీరోకు అక్కగా రంభ ఖరారు

స్టార్ హీరోకు అక్కగా రంభ ఖరారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : తెలుగు,తమిళ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ల జాబితాలో రంభ పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. తెలుగులో 'ఆ ఒక్కటి అడక్కు'తో పరిచయమైన రంభ కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టి రజనీకాంత్‌, కార్తీక్‌, ప్రభు, ప్రభుదేవా, విజయ్‌లాంటి స్టార్‌ హీరోల సరసన నటించింది. ఆమె రీ ఎంట్రీకి రంగం సిద్దమైంది. అయితే ఈ సారి స్టార్ హీరోకు అక్కగా చేస్తోంది.

  గ్లామర్‌ పాత్రలకు పెట్టింది పేరైన రంభకు తమిళనాట పెద్ద సంఖ్యలోనే అభిమానులున్నారు. నటిగా మంచి మార్కెట్‌ ఉన్న దశలోనే వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిన రంభ ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె శింబు హీరోగా నటించనున్న చిత్రంలో ఆయనకు అక్కగా నటించనున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

  రంభ ఆ మధ్య ఓ తెలుగింటి కెనడా బిజీనెస్ మాన్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక పాపకు తల్లి అయింది. ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించిన నటి రంభ. మొదట హీరోయిన్ గా చెలామనియైన రంభ, తర్వాత యువ హీరోల చిత్రంలో ఐటం సాంగ్ లలో నటించిన రంభ, ఆ తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది. అయితే ఇపుడు మళ్లీ ఎంట్రీ ఇస్తే కథానాయికపాత్రలు దొరక్కపోయినా, ఇప్పటికి కత్తిలా కనిపించే రంభ ఐటం సాంగ్ లకు కూడా రెడీ అంటోంది.

  కథకు అవసరమైన మంచి పాత్రలు దొరుకుతాయనే నమ్మకంతో మళ్లీ రే ఎంట్రీ ఇస్తానంటోంది. పనిలో పనిగా నిర్మాతగా కూడా మారి, లోబడ్జెట్ చిత్రాలు తీయాలని ఉబలాటపడుతోంది. ఇలా రంభ నటిగా, నిర్మాతగా అవతారం దాల్చి మనముందుకు మళ్లీ రాబోతోంది. దాంతో అభిమానులు రంభ కోసం ఎదురు చూపులు చూస్తున్నారట. దీనికోసం రంభ తన పాత దర్శకులతో పాటుగా నేటి యువ దర్శకులతో కూడా టచ్ లో ఉంటుందట. త్వరలోనే ఓ మంచి సినిమాతో తెలుగులోనూ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

  English summary
  Actress Rambha has acted in over 100 South Indian films and also in Bollywood films. She had done several successful films in Telugu, Tamil, Malayalam, Hindi, Kannada, Bengali and Bhojpuri films. She decided to give re entry in kollywood industry as sister of Simbu in an upcoming movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more