»   » హీరోయిన్ రంభ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది

హీరోయిన్ రంభ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన గ్లామర్, బబ్లీ యాటిట్యూడ్‌తో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల ప్రేక్షకులను ఊర్రూతలూగించిన హీరోయిన్ రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. తన భర్తతో కెనడాలో సెటిలైన ఆమె పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సినిమాల వైపు రావడానికి ప్రయత్నించారు.

అయితే రంభ కాపురంలో కొన్ని ఆటు పోట్ల కారణంగా ఆమె రీ ఎంట్రీ ప్రయత్నాలు ఫలించలేదు. కొంత కాలం ఆమె తమిళ టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. అందులో కూడా ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదనే చెప్పాలి.

Actress Rambha Re Entry soon

రెండేళ్ల క్రితం రంభ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, తెలుగు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభింస్తున్నారనే ప్రచారం సైతం సాగింది. అయితే అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. తాజాగా మరోసారి రంభ రీ ఎంట్రీ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

సరైన కథలు దొరకక పోవడం వల్లనే రంభ రీ ఎంట్రీ ఆలస్యం అవుతోందని, తాజాగా ఆమెకు పర్ఫెక్టుగా సూటయ్య కథ దొరికిందని, త్వరలో తమిళ సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత రంభ మళ్లీ తెరపైకి వస్తుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మరి ఆమె ఎలాంటి పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

English summary
Actress Rambha is planning to re-enter into film industry, as per sources she is in talks with few filmmakers and may start her second innings very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X