»   » సమంత... ఫ్యాన్స్ తో చేదు అనుభవం, లాఠీ ఛార్జీ (వీడియో)

సమంత... ఫ్యాన్స్ తో చేదు అనుభవం, లాఠీ ఛార్జీ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో ఎదురులేని హీరోయిన్ గా ఎదుగుతున్న సమంతకు తమళనాడులోని మధురైలో చేదు అనుభవం ఎదురైంది. నిన్నటి రోజు (ఆదివారం) అక్కడ ఓ ప్రెవేట్ పోగ్రామ్ లో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెకు ఫ్యాన్స్ వల్లే ఇబ్బందులు ఎదురవటం బాధాకరం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురైలోని వీ కేర్‌ సంస్థ...తమ నూతన శాఖ ప్రారంభించేందుకు సమంతను పిలిచాను. ఈమె రావటం గురించి ముందే ప్రచారం జర గడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

పోగ్రామ్ కు కాస్సేపు ముందు ఆదివారం మధ్యాహ్నం లగ్జరీ కారు లో సమంత షోరూమ్‌కి చేరుకుంది. అయితే ఊహించని విధంగా ఒక్క సారిగా ఆమెకోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ..ఆమె కారుని చుట్టుముట్టారు. పోగ్రామ్ నిర్వాహకులు సెక్యూరిటీ సహాయంతో చాలా కష్టపడి సమంతను లోపలికి తీసుకెళ్లారు.
కష్టపడి లోపలకు తీసుకు వెళ్లిన తర్వాత ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని, అనంతరం తిరిగి వెళ్లేందుకు వచ్చిన సమంతను అక్కడే కాచుకుని కూర్చున్న ఫ్యాన్స్ మరోసారి చుట్టుముట్టారు. అయితే ఈసారి మాత్రం వారిని అదుపుచేయడం సెక్యూరిటీ వల్ల కాలేదు.

ఈలోగా కొంతమంది ఆకతాయిలు ప్రాంగణంలో ప్రవేసించి, స్పీకర్లు ధ్వంసం చేసారు. అంతే కాకుండా, సమంత వచ్చిన కారు టైరు కూడా పంక్చర్‌ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులపై స్వల్పంగా లాఠీ ఛార్జి చేయక తప్పలేదు.

అయితే ఊహించని విధంగా ఫ్యాన్స్ ఇలా ముట్టడిస్తారని ఆమె ఊహించకపోవటం షాక్ కు గురైంది. అయితే అక్కడ నిర్వాహకులు, వెంటనే ఆమె ను షోరూమ్‌ లోపలకి తీసుకెళ్లిపోయారు. పరిస్థితి సద్దుమణిగాక ఆమె తిరిగి చెన్నైకి బయల్దేరింది.

ఇదే తొలి సారి కాదు

ఇదే తొలి సారి కాదు

గతంలోనూ ఓసారి ఇలాంటి అనుభవమే సమంత కు ఎదురైంది

సెక్యూరిటీ ప్లాబ్లమ్

సెక్యూరిటీ ప్లాబ్లమ్

ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సెక్యూరిటీని మరింత టైట్ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు

మిగతా వారికి సైతం

మిగతా వారికి సైతం

గతంలో కాజల్,శ్రియ,తమన్నా వంటి హీరోయిన్స్ కు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి.

నో కామెంట్

నో కామెంట్

అభిమానులు విషయం కావటంతో సమంత ఈ విషయమై నో కామెంట్ ధోరణి వహించి ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు.

కారు మీద కూడా

కారు మీద కూడా

ఈలోగా కొంతమంది ఆకతాయిలు ప్రాంగణంలో ప్రవేసించి కారు మీద దాడి చేసారు, అలాగే సమంత వచ్చిన కారు టైరు కూడా పంక్చర్‌ చేశారు

లాఠీ ఛార్జీ

లాఠీ ఛార్జీ

కారు టైర్ పంక్చర్ అవటంతో..దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులపై స్వల్పంగా లాఠీ ఛార్జి చేయక తప్పలేదు.

    English summary
    Actress Samantha attacked while opening a shopping mall at Madhurai.
    Please Wait while comments are loading...