For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాజీ హీరోయిన్ సరిత కుమారుడి తెరంగేట్రం

  By Srikanya
  |

  చెన్నై : మరో చరిత్ర వంటి ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించిన సరిత ఇప్పుడు తన కుమారుడు నితీన్‌కన్నన్‌ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం రూపొందనుంది. చెన్నైలోని ఏవీఎం స్టూడియో వినాయక ఆలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది. 'దర్శకశిఖరం' కె.బాలచందర్‌ హాజరై కెమెరా స్విఛాన్‌ చేశారు. అనంతరం తొలి సన్నివేశంపై దర్శకుడు కె.భాగ్యరాజ్‌ క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రంలో లో ప్రభు ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో నటి రాధ, భాగ్యరాజ్‌ సతీమణి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

  ఆ తరం హీరోలు,హీరోయిన్స్ తన వారసులను సినీ రంగ ప్రవేశం చేయిస్తున్నారు. తమిళ హీరో కార్తీక్ కుమారుడు,రాధ రెండో కుమార్తె కాంబినేషన్ లో మణిరత్నం కడలి అనే చిత్రం రూపొందిస్తున్నారు. రాధ మొదటి కుమార్తె తెలుగులో నాగచైతన్య సరసన జోష్ చిత్రంతో పరిచయమైంది. మరో ప్రక్క బాగ్యరాజా కుమారుడు ఆల్రెడీ తెలుగులో ట్రైల్స్ వేస్తున్నాడు. ఇక ప్రభు కుమారుడు సైతం కుమారుడు విక్రం హీరోగా వస్తున్న చిత్రం 'గుమ్కీ' పై మంచి అంచనాలే ఉన్నాయి.

  'నడిగర్‌ తిలగం' వారసత్వం పుణికిపుచ్చుకుని వస్తున్న మూడోతరం నటుడు, ప్రభు కుమారుడు విక్రం హీరోగా వస్తున్న చిత్రం 'గుమ్కీ'. తెలుగులో 'గజరాజు'గా విడుదల కానుంది. తిరుపతి బ్రదర్స్‌ పతాకంపై లింగుస్వామి నిర్మిస్తుండగా ప్రభు సాలమన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై శివాజి గణేశన్‌ కుటుంబం భారీ ఆశలను పెంచుకుంది. శివాజి తర్వాత ఆయన కుమారుడు ప్రభు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన మనవడు మరింత పేరు ప్రఖ్యాతులు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కుటుంబీకుల పూర్తి సహకారంతో వస్తున్న విక్రం 'గుమ్కీ' విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. క్లిష్టమైన కథను ఎంచుకున్నాడని, పలు ఫీట్లు కూడా చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

  ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో 'సుందర పాండియన్‌' ఫేం లక్ష్మీ మీనన్‌ కథానాయిక. ఇమాన్‌ సంగీతం సమకూర్చాడు.విక్రంప్రభు మాట్లాడుతూ.. 'గుమ్కీ' వంటి కథ చేయడం నిజంగానే అదృష్టం. శ్రమ అని చెప్పడం కన్నా.. ప్రతి ఒక్కరూ కఠోరంగా శ్రమించారని చెబితే అతిశయోక్తి కాదని, ఆశించిన స్టార్‌డం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పాడు. హీరోయిన్ లక్ష్మీ ముచ్చటిస్తూ.. నన్ను వెండితెరపైకి తీసుకొచ్చిన తొలి చిత్రం 'గుమ్కి'. అయితే 'సుందర పాండియన్‌' ముందుగా జనం చెంతకు వచ్చింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అందుకు తగ్గ ఫలితం దక్కుతుందని తెలిపింది.

  English summary
  Maro Charitra fame ACTRESS SARITHA SON NITHIN KANNAN MOVIE launched at Chennai AVM Studies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X