»   » నటి వింధ్యకు అస్వస్థత

నటి వింధ్యకు అస్వస్థత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినీ నటి వింధ్య అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. 'సంగమం' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి వింధ్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. సినిమాల్లో నటించడం విరమించాక ఆమె అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో 'స్టార్‌' ప్రచారకర్తగా పేరు సంపాదించుకున్నారు.

2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఆమెను చికిత్స నిమిత్తం కేకేనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే....

Actress Vindhya hospitalized

దక్షిణాది చిత్రాల సినీ నటి వింధ్య అస్వస్థతకు గురై బుధవా రం చైన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యా రు. సంగమం చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన నటి వింధ్య ఆ తరువాత తంబీ విట్టు కల్యాణం, చార్లిచాప్లిన్, కన్నమ్మ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో అభిషేకం చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.

2011 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కొద్ది రోజుల క్రితం వారణాసి వెళ్లారు.

అక్కడి నుంచి చెన్నైకి చేరుకోగానే అనారోగ్యానికి గురయ్యూరు. బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో స్థానిక కేకే నగర్‌లో చేర్చారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ఆస్పత్రి చికిత్స తీసుకుంటున్నారు.

English summary
Tamil actress Vindhya, who made her debut in the film Sangamam, has been hospitalized in KM Speciality Hospital in Chennai. Vindhya had acted in films like Azhagu Nilayam and Ayutham Seivom and had also campaigned for the AIADMK during the state assembly elections a few years back.
Please Wait while comments are loading...