»   » సినిమా అవకాశం కోసం వ్యభిచారమా? స్నేహ

సినిమా అవకాశం కోసం వ్యభిచారమా? స్నేహ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలామంది హీరోయిన్లు తమకు సినిమా అవకాశాలు దక్కించుకునేందుకు దర్శకులకు సెక్స్‌వర్కర్లుగా మారిపోయారంటూ తమిళనాడుకు చెందిన కొన్ని న్యూస్ఏజెన్సీలు ఇటీవల వార్తలు ప్రచురితం చేశాయి. దీనిపై స్నేహ మండిపడింది. దాన్ని ఖండిస్తూ..ఓ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం రేపింది. కౌలాలంపూర్‌లోని మక్కల్ ఒసాయ్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 'మాది అందాల ప్రపంచమే. అంతమాత్రాన హీరోయిన్లను సెక్స్‌వర్కర్లుగా అభివర్ణించడం సమంజసం కాదు' అంది. ఈ వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పింది. హీరోయిన్లకు, దర్శకులకు సంబంధాలు అంటగడుతూ ప్రచారమైన వార్తల పట్ల నటి స్నేహ మండిపడింది. హీరోయిన్లెవరూ సెక్స్‌వర్కర్లు కారంటూ ఘాటుగా బదులిచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu