»   » రైతులకోసం కదులుతున్న కోలీవుడ్: మనహీరోల సంగతేమిటి?

రైతులకోసం కదులుతున్న కోలీవుడ్: మనహీరోల సంగతేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాట రైతుల ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. వ్యవసాయం చేస్తూ అన్నం పెడుతున్న తమకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన రైతులగోడు పట్టించుకున్నవారే కరువయ్యారు. అయితే ఈ విషయమ్మీద ఎప్పటినుండో తన స్టాండ్ ఎటువైపో చెప్తూనే ఉన్నాడు విశాల్.

 ప్రతీ టికెట్ నుంచీ

ప్రతీ టికెట్ నుంచీ

నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన రోజునుంచే ఇకనుంచీ విడుదలయ్యే సినిమాల ప్రతీ టికెట్ నుంచీ ఒక్కరూపాయి రైతుల సంక్షేమం కోసం వినియోగించాలంటూ సంచలనాత్మకమైన నిర్ణ్యం తీసుకోవటం ఒక కొత్త చైతన్యానికి తెర తీసింది. రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నిర్మాతల సంఘం నూతన కార్యవర్గం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.

నిర్మాతల వంతుగా ఒక రూపాయి

నిర్మాతల వంతుగా ఒక రూపాయి

సినిమా టిక్కెట్‌ ధరలో నిర్మాతల వంతుగా ఒక రూపాయి రైతులకు అందించనుంది. అంటే తమిళనాడులో ప్రదర్శిత మయ్యే అన్ని సినిమాలకు ఏదో ఒకరోజు ప్రతి టిక్కెట్‌పై ఒక రూపాయిని రైతు నిధికి కేటాయిస్తారు. ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని, తద్వారా ఎన్ని కోట్లు వచ్చినా అంతా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి ఇస్తామని విశాల్‌ చెప్పటం అంతటా ప్రశంసలు పొందుతోంది.

 ప్రకాశ్ రాజ్ కూడా

ప్రకాశ్ రాజ్ కూడా

విశాల్ తో పాటుగా నటుడు ప్రకాశ్ రాజ్ కూడా చాలా కాలంగా తమిళ రైతుల పరిష్తితుల మీద ఆందోళన గానే ఉన్నారు. గత మార్చ్ లోనూ వీరు పర్త్యక్ష మద్దతు పలికారు విపరీతమైన కరవుతో బాధపడుతున్న తమిళనాడు రైతులకు మద్దతుగా నటులు కూడా రోడ్డెక్కారు. హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్.. ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.

మెడలో కపాలాలు ధరించి

మెడలో కపాలాలు ధరించి

రైతులు కూడా మెడలో కపాలాలు ధరించి.. కరవు తీవ్రతను ప్రతిబింబించేలా నిరసన వ్యక్తం చేశారు. రైతుల రోదనలను ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడ తీవ్రస్థాయిలో ధర్నా చేస్తున్నామని చెప్పారు. అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న రైతులతో కలిసి వీరు జంతర్ మంతర్ వద్ద రోడ్డుపై కూర్చున్నారు.

ఇండస్ట్రీ లో కదలికలు

ఇండస్ట్రీ లో కదలికలు

నల్లటి దుస్తులు ధరించిన విశాల్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే కేవలం ధర్నాల తోనే కాదు. ఆర్థికంగా కూడా రైతులకి భరోసా ఇచ్చేందుకు వీరు కృషి చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఎవ్వరూ కలిసి రాక పోయినా నెమ్మదిగా విశాల్ చెప్పిన మాట మీద అందరి దృష్టీ పడుతోంది రైతుల కోసం తమవంతు సాహాయం అందించటానికి ఇండస్ట్రీ లో కదలికలు మొదలయ్యాయి.

విశాల్ స్పూర్తి తో

విశాల్ స్పూర్తి తో

ఇప్పుడు విశాల్ స్పూర్తి తో తమిళ ఇండస్ట్రీ ఒక్కొక్క అడుగూ కదులుతోంది. తాజాగా నటి స్నేహ తన వంతు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. తన భర్తతో కలిసి రెండులక్షల రూపాయలను రైతులకు అందజేసారు.... మిళనాడులో అప్పులపాలై కష్టాలు పడుతున్న రైతులను ఆదుకొనేందుకు నటుడు విశాల్‌ చేస్తున్న కృషి స్ఫూర్తితో స్నేహ - ప్రసన్న దంపతులు ఆదివారం 10 మంది రైతులకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు.

 ప్రసన్న

ప్రసన్న

ఆ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ... ‘రైతులు పడుతున్న బాధల్ని టీవీలో చూస్తున్నప్పుడు వారికి ఏదైనా సాయం చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు... ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాల్‌కు ఇచ్చిన మొత్తాన్ని రైతులకు ఇచ్చేయడం చూశాం. ఆ స్ఫూర్తితోనే రైతులకు ఆర్థిక సాయం చేశాం.' అని చెప్పారు.

స్నేహ

స్నేహ

స్నేహ మాట్లాడుతూ... మనకు అన్నం పెట్టే రైతులు ఎంత కష్టపడుతున్నారో చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. తాము చేసిన సాయం చాలా చిన్నదే అయినా, మరింత మంది రైతులను ఆదుకునేందుకు ఇది దోహదపడుతుందన్న ఉద్దేశంతోనే అందరి సమక్షంలో రైతులకు సాయం చేస్తున్నామని చెప్పారు.

English summary
Prasanna and Sneha, the famous star couple in Kollywood has donated Rs 2 lakhs to ten struggling farmers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu