మనసు చెబుతోంది.. ఆయన దర్శకత్వంలో కచ్చితంగా చేస్తా.. హీరోయిన్ కామెంట్స్

దర్శకులు హీరోగా, హీరోలు దర్శకులుగా ఇలా రెండు పడవలపై ప్రయాణం చేసిన వారెంతో మంది ఉన్నారు. అయితే అలాంటి రెండు పడవల ప్రయాణంలో అందరూ విజయతీరాలకు చేరుకోలేదు. నాటి తరంలో అలా చేసి సక్సెస్ అయ్యారు కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే నేటి తరం హీరోల్లోనూ కొంతమంది హీరోలుగా చేస్తూనే దర్శకత్వంపై మక్కువ పెంచుకుంటున్నారు.

మణిరత్నం హీరోయిన్..

మణిరత్నం హీరోయిన్..

మణిరత్నం చిత్రాలతో పాపులర్‌ అయిన నటి ఈ భామ. కార్తీ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన కాట్రు వెలియిడై చిత్రంలో నటించిన అదితిరావ్‌ తాజాగా ఆయన దర్శకత్వంలోనే పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా తుగ్లక్‌ దర్బార్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది.

తాజాగా సైకో అంటూ..

తాజాగా సైకో అంటూ..

ఇక హిందీ, తెలుగు, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ హీరోయిన్ ఉదయనిది స్టాలిన్‌తో చేసిన సైకో చి త్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ ధనుష్ స్వీయ దర్వకత్వంలో రాబోతోన్న సినిమా సంగతి చెప్పుకొచ్చింది.

ధనుష్ దర్శకత్వంలో అదితీ..

ధనుష్ దర్శకత్వంలో అదితీ..

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటించే చిత్రంలో అదితి రావ్‌ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం 2018లోనే జరిగింది. అయి తే ఆ చిత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఈ మధ్యలో ధనుష్‌ అసురన్, పటాస్‌ చిత్రాల్లో నటించేశాడు. ప్రస్తుతం సురళి, కర్ణన్‌ చిత్రాలతో పాటు కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.

మనసు చెబుతోంది..

మనసు చెబుతోంది..

ధనుష్‌ దర్శకత్వంలో కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అది జరిగి తీరుతుందని తన మనసు చెబుతోందని, అది ఎప్పు డూ సరిగానే చెబుతుందని అంది. ధనుష్‌ ప్రతిభావంతుడైన దర్శకుడని, తను నటించడంతో పాటు ఇతరుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దిట్ట అని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X