»   » కార్తీ, రకుల్‌ మ్యాజిక్.. ఆదిత్య మ్యూజిక్‌ సినిమా ఖాకీ..

కార్తీ, రకుల్‌ మ్యాజిక్.. ఆదిత్య మ్యూజిక్‌ సినిమా ఖాకీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Karthi's Dheeran Adhigaram Ondru Trailer Date Out కార్తీ, రకుల్‌ మ్యాజిక్..

నవంబర్ లో కార్తీ, రకుల్‌ ప్రీత్ సింగ్ జంటగా 'ఆదిత్య మ్యూజిక్‌' సినిమా 'ఖాకి- ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'
కార్తీ - మంచి మాస్ హీర్. క్లాస్ కుర్రాడు కూడా. రకుల్ - హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్. ఈ ఇద్దరి కాంబినేషన్ కచ్చితంగా బాగుంటుంది. ఇక, ఇద్దరి మధ్య కెమిస్ర్టీ ఏ రేంజ్ లో ఉంటుందో 'ఖాకి' చూసి తెలుసుకోవాల్సిందే. 'ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'... అనేది ఉపశీర్షిక.

నిర్మాతగా మారిన ఉమేశ్ గుప్తా..

నిర్మాతగా మారిన ఉమేశ్ గుప్తా..

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న‘ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌' నుంచి వస్తోన్న తొలి చిత్రం ఇది. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు సాధించిన ఆదిత్యా ఉమేశ్ గుప్తా మంచి చిత్రం ద్వారా నిర్మాతగా మారాలనుకున్నారు. అందులో భాగంగా కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు'ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

 నవంబర్ 17న రిలీజ్

నవంబర్ 17న రిలీజ్

సూపర్‌ హిట్‌ తమిళ సినిమా ‘చతురంగ వేట్టై' ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న, ట్రైలర్‌ను వచ్చే నెల 17న, సినిమాను నవంబర్‌ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు.

వాస్తవ కథకు తెర రూపం

వాస్తవ కథకు తెర రూపం

ఈ సందర్భంగా ‘ఆదిత్య మ్యూజిక్‌' సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ- ‘‘2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్న. ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు.

జిబ్రాన్ మ్యూజిక్

జిబ్రాన్ మ్యూజిక్

తెలుగులో ‘రన్‌ రాజా రన్‌', ‘జిల్‌', ‘బాబు బంగారం', ‘హైపర్‌' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ నెల 27న టీజర్ ను, వచ్చే నెల 17న ట్రైలర్‌ను, నవంబర్‌ 17న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

నటీనటులు..

నటీనటులు..

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

English summary
Aditya music's chief Umesh Gupta becomes producer for Khaki. Karthi, Rakul Preet Singh are lead pair. This movie coming on November 17th. Umesh Gupta said This movie made on real incident base. Karthi will attract audience as police officer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu