»   » బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్ ఎవరో తెలుసా?, ఊహించనుకూడా లేరు

బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్ ఎవరో తెలుసా?, ఊహించనుకూడా లేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూర్తిస్థాయి సెలబ్రిటీషో బిగ్ బాస్ రకరకాల భావోద్వేగాలు, మామూలుగా మనం చూడని కొత్త కోణం, వివాదాలూ, విమర్షలూ వెరసి ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠని రేపిన షో బిగ్ బాస్, హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కీ పాకిన ఈ రియాలిటీషో కాన్సెప్ట్ దక్షిణాదికి రావ్తానికి చాలా సమయమే పట్టినా... మన వాళ్ళని కూడా బాగానే ఆకర్షించి మంచి టీఆర్పీలనే సాధించి పెట్టింది. అటు తమిళం లో కమల్ హాసన్, ఇటు తెలుగులో ఎన్టీఆర్ తమదైన సైలి లో మొదటి సీజన్ ని బాగానే రక్తి కట్టించారు.

మళ్ళీ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలే ఉన్నాయట

మళ్ళీ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలే ఉన్నాయట

మొత్తానికి సీజన్ వన్ విజయవంతంగా ముగియటం తో అప్పుడే రెండో సీజన్ కోసం కూడా ప్రయత్నాలూ మొదలు పెట్టేసారట నిర్వాహకులు. తెలుగు సంగతి ఇంకా తెలియలేదు గానీ (దాదాపుగా మళ్ళీ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలే ఉన్నాయంటున్నారు. ) తమిళం లో మాత్రం ఈ సీజన్ కి అరవింద స్వామి హోస్ట్ గా వ్యవహరించనున్నాడనే మాట వినిపిస్తోంది...

సీనియర్ హీరో కమల్ హాసన్

సీనియర్ హీరో కమల్ హాసన్

తమిళంలో బిగ్‌బాస్ సీజన్ వన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సీనియర్ హీరో కమల్ హాసన్, ఈ షోను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సీజన్ వన్‌కు హోస్ట్‌గా ఉన్న కమల్, సీజన్ 2కు కుదరదని చెప్పాడట. దీంతో ఆయన స్థానంలో ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. నిన్నమొన్నటి వరకూ ఈ ఛాన్స్ కోలీవుడ్ క్రేజీ హీరోకు సూర్యకు దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది.

అరవింద్ స్వామి

అరవింద్ స్వామి

అయితే తాజాగా కమల్ వారసుడిగా కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2కు క్రేజీ హీరో కాకుండా ఎవరూ ఊహించని ఒక కొత్త స్టార్ ఉండాలని భావిస్తున్న నిర్వాహకులు. ఇందుకోసం వెటరన్ హీరో, లేటెస్ట్ విలన్ అయిన అరవింద్ స్వామిని ఎంపిక చేయాలని భావిస్తున్నారట. హీరోగా సూర్యకు కమిట్ మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని భావించారట నిర్వాహకులు.

పక్కా క్లారిఫికేషన్ రాలేదు

పక్కా క్లారిఫికేషన్ రాలేదు

దీంతో అనూహ్యంగా అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. పక్కా క్లారిఫికేషన్ రాలేదు గానీ, ఇందుకు అరవింద్ స్వామి కూడా సానుకూలంగా స్పందించాడనీ, కోలీవుడ్ బిగ్‌బాస్ సీజన్ 2కు హోస్ట్‌గా అరవింద్ స్వామి వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ అంటున్నారు. 'తని ఒరువన్'తో స్టయిలిష్ విలన్‌గా కోలీవుడ్ ఆడియెన్స్‌ను మెప్పించిన ఒకప్పటి రోజా హీరో. బిగ్‌బాస్ హోస్ట్‌గా మురిపిస్తే వెటరన్ స్టార్ ఇమేజ్ మరింతగా పెరుగుతుందని చెప్పొచ్చు.

English summary
As per latest reports, it is actor Arvind Swamy is to host the next season of the Bigg Boss Show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu