»   »  జారిపడటం కాదు, ప్రమాదానికి కారణం వేరు, చనిపోయి ఉండేవాణ్ణి: కమల్ రివీల్ చేసాడు

జారిపడటం కాదు, ప్రమాదానికి కారణం వేరు, చనిపోయి ఉండేవాణ్ణి: కమల్ రివీల్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కమల్ రీసెంట్ గా తన ఆఫీసులోనే మెట్లమీద నుంచి జారి పడిపోయి, చాలా సీరియస్ అయ్యి, రెండు సార్లు ఆపరేషన్ చేసే స్దితిదాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆఫీసులోనే ఆయనకు ప్రమాదం జరగటం ఏమిటి. అదీ విపరీతంగా రక్తం పోయేంత ప్రమాదానికి దారి తీయటం ఏమిటి అనే విషయాలు పై కమల్ కోలుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిందేమిటంటే..

కమల్ ఆఫీస్ చెన్నైలోని ఆళ్వార్‌పేట లో ఉంది. తన ఆఫీస్ లోని ఒక కార్నర్ కమల్ తెగ ఇష్టం. అందుకు కారణం ఆ మూల నిలబడితే బయిట రోడ్డు ,హడావిడి కనపడుతుంది. 18 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గది కార్నర్ వద్ద నిలబడి రోడ్డుపై వచ్చే పోయే జనాలను చూస్తూ, ఏదో ఆలోచిస్తూ టైమ్‌పాస్ చేస్తుంటారు కమల్. ఆ రోజు కూడా అలానే నిలబడ్డారు.

కానీ ఊహించని విధంగా ఆ కార్నర్ ఈసారి మాత్రం కమల్‌కి ట్విస్ట్ ఇచ్చింది.ఆయన ఎక్కడైతే నిలబడ్డారో ఆ ప్రదేశం హఠాత్తుగా కుంగిపోయింది. దాంతో కమల్ 18 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. అంత ఎత్తు నుంచి పడటంతో దెబ్బలు తగిలి విపరీతంగా రక్తం పోయిందట.

కమల్ చెప్తూ...''లక్కీగా పక్కన మనుషులు ఉండటంవల్ల ఆస్పత్రిలో చేర్చారు. లేకపోతే చనిపోయి ఉండేవాణ్ణి'' అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కమలే తెలిపారు.

"After the fall, I was bleeding profusely. I could have bled to death," : Kamal

అలాగే ..కమల్ కంటిన్యూ చేస్తూ...తన ఆఫీసులో సినిమాకు సంబంధించిన పని చూసుకుని వస్తూ.. 18 అడుగుల ఎత్తు నుంచి పడ్డానని కమల్ చెప్పారు. తాను చాలా సంవత్సరాలుగా అదే ఆఫీసు వాడుతున్నానని, అలవాటైనదే అయినా అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.

ఇక అసలు చెప్పాలంటే ఇది చాలా సిల్లీ యాక్సిడెంట్ అని, గతంలో దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ అమితాబ్ బచ్చన్ చెయ్యి కాల్చుకున్నట్లుగానే తనకూ అయ్యిందని నవ్వుతూ చెప్పారు.

కూలీ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి, దాన్నుంచి కోలుకున్న తర్వాత.. 1983 సంవత్సరంలో దీపావళి టపాసులు కాలుస్తూ చెయ్యి కాల్చుకోవడంతో చాలా నెలల పాటు అమితాబ్ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే విషయాన్ని కమల్ గుర్తుచేశారు.

నిజానికి తాను కూడా పైనుంచి కింద పడినప్పుడు తీవ్రంగా రక్తస్రావం అయిందని, దానివల్ల మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని, కానీ అదృష్టవశాత్తు ఆ సమయానికి ఆఫీసులో వేరేవాళ్లు కూడా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల బతికిపోయానని అన్నారు.

ప్రస్తుతం కమల్ తన దశావతారం సినిమాకు సీక్వెల్‌గా శభాష్‌ నాయుడు అనే సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగులో ఆయన మళ్లీ పాల్గొనే అవకాశం ఉంది.

ఇక మరో నెలలోపు ఆయన 'శభాష్ నాయుడు' షూటింగ్‌లో పాల్గొంటారనే వార్త వచ్చింది. దానికి కమల్ స్పందిస్తూ - ''నెల రోజుల్లోనా? చాన్సే లేదు. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నా. కనీసం రెండు నెలలైనా పడుతుంది. ఆ తర్వాతే షూటింగ్'' అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కుమార్తె శ్రుతీహాసన్ ఆయనకు తెరపైన కూడా కుమార్తెగా నటిస్తున్నారు.

English summary
Kamal Hassan was quoted saying, “It could have been much worse. After the fall, I was bleeding profusely. I could have bled to death. Luckily for me there was someone else in the office with me at the time that it happened.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu