For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకాంత్ ఖరారు...అంటే పవన్ కళ్యాణ్ లేనట్లేనా?

  By Srikanya
  |

  చెన్నై : హిందీలో మంచి విజయం సాధించిన అక్షయ్ కుమార్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రం రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్ తెలుగులో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా సీన్ మారింది. రజనీకాంత్ ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పవన్ కళ్యాణ్ త్వరలో మోడ్రన్ శ్రీకృష్ణుడిగా కనిపించటం కష్టమే అంటున్నారు చెన్నై వర్గాలు. 'ఓ మై గాడ్' చిత్రం రీమేక్ రైట్స్ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

  చెన్నై సమాచారం ఏమిటంటే...చిన్న కుమార్తె దర్శకత్వంలో నటించిన రజనీకాంత్‌ త్వరలో పెద్ద కుమార్తె దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. రజనీ ప్రస్తుతం చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'విక్రమసింహ' (కోచ్చడయాన్‌)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి రానుంది. ఇదిలా ఉండగా ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఇది అక్షయ్‌కుమార్‌ నటించి, నిర్మించిన 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌ అని తెలిసింది. ఇందుకోసం ఆమె ముంబయి వెళ్లి అక్షయ్‌తో చర్చలు సాగిస్తున్నారని సమాచారం.

  ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఐశ్వర్య నుంచి త్వరలోనే వస్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ రీమేక్‌లో ఐశ్వర్య తన తండ్రిని కృష్ణుడిగా చూపించే అవకాశాలున్నాయి. హిందీలో ఈ పాత్రను అక్షయ్‌ పోషించారు. అంతేగాక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషలు రెండింటిలోనూ విడుదల కానుంది. దాంతో రజనీ సీన్ లోకి వచ్చాక,దాన్ని తెలుగులో మరో నిర్మాత ఎందుకు కొని రీమేక్ చేస్తాడు...పవన్ ఈ మధ్య హిందీ చిత్రాలు రీమేక్ లు వరసగా చేయటం వల్ల పుట్టిన రూమరే తప్ప మరొకటి కాదు అని తేల్చేస్తున్నారు.

  'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి పాత వస్తువులు అమ్మే షాప్ ఉంటుంది. అక్కడ దేవతా మూర్తుల విగ్రహాలు ఎక్కువ రేటుకి అమ్ముతూంటాడు. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

  మరాఠీలో'కాంజీ విరుథ్ కాంజీ', హిందీలో 'కిషన్ వర్సస్ కన్హయ్యా'గా లో సూపర్ హిట్టైన నాటకాన్ని సినిమాగా తీసి విజయం సాధించారు. అయితే ఈ నాటకం 'ది మాన్ హూ సూడ్ ది గాడ్' (2001)అనే చిత్రం నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఇక ఈ చిత్రంలో కృష్ణుడు పాత్ర ఫుల్ సూట్‌లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లా కనిపిస్తుంది. సుదర్శన చక్రం బదులు చేతిలోకీ చెయిన్ గిరగిరా తిప్పడం, నెమలి పించం కూడా అదేదో ట్రోఫీ అన్నట్టు డిజైనర్ మేక్‌తో వుండడం, అతి సాధారణ భాష మాట్లాడడం వంటి వాటితో మలిచి విజయం సాధించారు. ఈ పాత్రలో రజనీ మెప్పించబోతున్నాడన్నమాట. అయితే గతంలో ఇలాగే నాగార్జున..మోడ్రన్ దేముడుగా..మంచు విష్ణు సినిమాలో కనపడి బోల్తా కొట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది.

  English summary
  Following the footsteps of her younger sister, Soundarya Ashwin, who is directing her father Rajinikanth in Kochadaiyaan, Aishwarya Dhanush too is all set to direct the superstar. Well, she is likely to remake Akshay Kumar's recent Hindi movie Oh My God, which won critical appreciation and did decent business.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X