»   »  రజనీ సరసన ఐశ్వర్య?

రజనీ సరసన ఐశ్వర్య?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai
రోబో సినిమాలో రజనీకాంత్ సరసన ఐశ్వర్యా రాయ్ ని నటింపజేసేందుకు దర్శకుడు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ఆయన ముంబై వెళ్లినప్పుడు ఐశ్వర్యాకు రోబో స్క్రిప్టును వినిపించాడని తెలుస్తోంది. అయితే ఐశ్వర్యా రాయ్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి వుంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు క్రేజు కూడగట్టేందుకు రోబో సినిమాను ప్లాన్ చేశారు. శివాజీలోనే ఐశ్వర్యా రాయ్ ని తీసుకోవాలని శంకర్ అనుకున్నారు. కానీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె శివాజీకి కాల్షీట్స్ ఇవ్వలేకపోయింది. భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఉన్న ఐశ్వార్య పాపులారిటీ సినిమాకు ఎంతో ఉపయోగపడుతుందని శంకర్ భావిస్తున్నారట. అవకాశం వస్తే రజనీతో నటించడానికి తాను సిద్ధమేనని ఐశ్వర్యా రాయ్ ఇటీవల చెన్నైలో చెప్పింది. ఇక రోబో సినిమాలో నటించేందుకు దీపికా పడుకొనే కూడా క్యూలో ఉందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X