For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన ఐశ్వర్య.. అది కదా ముఖ్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

  |

  లేడీ కమెడియన్స్ లో తనదైన ముద్ర వేసుకున్నారు శ్రీలక్ష్మి. తెలుగులో వందల సినిమాల్లో లేడీ కమెడియన్ పాత్రలలో నటించిన ఆమె ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమయ్యారు. శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలలో నటించారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా ఆయన నటించారు.. ఆయన కుమార్తె ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె తాజాగా రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. అదేంటి అని అడిగితే ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

  ఆ సినిమాతో

  ఆ సినిమాతో

  నటి ఐశ్వర్య రాజేష్ ‘కక్కా ముత్తై' సినిమాతో నటిగా తమిళ సినీ ప్రపంచానికి పరిచయం అయింది. అంతకు ముందే ఆమె హీరోయిన్ గా పరిచయం అయినా ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ఐశ్వర్య రాజేష్ విజయ్ సేతుపతి సరసన నటించిన కె / పి రణ సింగం ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమా ఆసక్తికరంగా ఉండటంతో పాటు మంచి స్పందన తెచ్చుకుంది.

  Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!

  అన్ని పాత్రలలో

  అన్ని పాత్రలలో

  విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతితో సహా పెద్ద హీరోలతో జత కట్టిన ఐశ్వర్య రాజేష్ మహిళల క్రికెట్ సెంట్రిక్ చిత్రం 'కనా'లో క్రికెటర్‌గా నటించమంటే జీవించి అభిమానుల నుంచి ప్రశంసలు అలాగే మంచి అవార్డులు కూడా అందుకున్నారు. శివకార్తికేయన్ చెల్లెలు ఎంగా వీటు పిళ్లై చిత్రంలో నటించిన ఆమె రణ సింగం చిత్రంలో, విదేశాలలో మరణించిన తన భర్త మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి కష్టపడుతున్న ఒక సాధారణ మహిళగా నటించి ఆకట్టుకుంది.

  Karthika Deepam కార్తీక్ చేయిపట్టి లాగిన మోనిత.. నీ పెళ్లి పెటాకులే.. దీప వార్నింగ్.. హాస్పిటల్‌లో హైడ్రామా

  పారితోషికం పెంచేసింది

  పారితోషికం పెంచేసింది

  ఇంతకు ముందు ఆమె యాక్షన్ చిత్రంలో నటించలేదు మరియు మొదటిసారి 'ప్రాజెక్ట్ టూ' అనే థ్రిల్లర్ చిత్రానికి కథానాయకురాలిగా నటించింది. ప్రస్తుతం మొదటిసారి పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉన్న విఘ్నేష్ కార్తీ దర్శకత్వం వహించిన ఈ రెండు చిత్రాలు జూలై 30 న సోనీ లైవ్ ఓటీటీలో విడుదల కానున్నాయి. దీని కోసం ప్రమోషన్స్ కూడా మంచి ఊపులో ఉన్నాయి. ఇక ఆమె పారితోషికం పెంచేసింది అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా ఆమె తాజాగా ఆ విషయం మీద స్పందించింది.

  షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
  నాకు అది ముఖ్యం కాదు

  నాకు అది ముఖ్యం కాదు

  ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, కె / పి రణసింగం వంటి చిత్రాలు ప్రజలకు తనని దగ్గర చేశాయని అన్నారు. ఆ సినిమాల విజయం వల్ల నా రెమ్యునరేషన్ పెరిగింది. కానీ నా మొదటి లక్ష్యం ఎప్పుడూ రెమ్యునరేషన్ కాదు అని చెప్పుకొచ్చింది. అర్హురాలిని కాబట్టి అంత ఇస్తున్నారన్న ఆమె డబ్బు ముఖ్యం కాదని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తనకు ముఖ్యమని కూడా ఆమె పేర్కొంది.

  వితౌట్ మేకప్

  వితౌట్ మేకప్

  తన తదుపరి చిత్రం టక్ జగదీష్ గురించి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, "టక్ జగదీష్ లో, నేను ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిగా నటిస్తున్ననన్న ఆమె సినిమాలో నేను ఎటువంటి మేకప్ లేకుండా కనిపించాలని దర్శకుడు శివ చాలా స్పష్టంగా చెప్పాడని అందుకే వితౌట్ మేకప్ నటిస్తున్నానని పేర్కొంది. టక్ జగదీష్ కాకుండా ఈ భామ హీరోయిన్ సాయి ధరం తేజ్ రిపబ్లిక్ లో కూడా నటిస్తోంది.

  English summary
  In a recent interview Aishwarya was asked about the her increasing the remuneration. Speaking about it, she said that she gets only what she deserves.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X