Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Aishwarya Rajinikanth: నొప్పితో అరుపులు.. అయినా తగ్గను అంటూ ధనుష్ మాజీ భార్య ఎమోషనల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇటీవల తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్న ధనుష్ నుంచి ఆమె విడిపోతుంది అని తెలియగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక మళ్లీ వారిద్దరూ కలిసే అవకాశం ఉంది అని కూడా తమిళ చిత్ర పరిశ్రమలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ ఒకరికొకరు బలమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే విడాకుల కోసం ముందుకు వెళ్లినట్లు అర్థమైంది.
ఇక ఆమె సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్ చేస్తున్న ఫొటోలను చూస్తుంటే విడాకులతో కొంత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆమెకు వివిధ రకాల ఆలోచనలతో వెళుతోంది. ఇటీవల ఆమె ఎప్పుడు లేని విధంగా ఒక ఫొటో పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

సెలబ్రేషన్స్ తరువాత..
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య 2004లో ధనుష్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇక 18 ఏళ్ళ పాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు ఈ ఏడాది జనవరి 17వ తేదీన విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో ఐశ్వర్య ధనుష్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది.
అంతకుముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంతో సంతోషం గా సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట కేవలం మూడు వారాల్లోనే ఎందుకు విడిపోవాలని అనుకున్నారు అని అభిమానులను ఆశ్చర్య పోయారు.

విడిపోవడానికి కారణం?
అయితే ఐశ్వర్య ధనుష్ విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఈ దంపతులు ఇద్దరు మాత్రం ఇష్టపూర్వకంగానే ఒకరికొకరు వ్యక్తిగత నిర్ణయాలకు గౌరవించే విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. అసలైతే ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పర్సనల్ లైఫ్ లో భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం లేదని అందు వల్లనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఒక టాక్ వినిపించింది.

ఆ బాద్యతలో..
ఇక విడాకులు తీసుకున్న తర్వాత దంపతులు వారి పిల్లల విషయంలో మాత్రం ఎలాంటి లోపాలు లేకుండా తల్లి తండ్రి అనే బాధ్యతకు సరైన న్యాయం చేయాలని డిసైడ్ అయ్యారు. ధనుష్ కూడా ఇటీవల ఓ సినిమా వేడుకలో తన ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్ళాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విడాకుల తరువాత
ఇక ధనుష్ రీసెంట్ గా ఐశ్వర్య కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సాంగ్ గురించి సోషల్ మీడియాలో కూడా ట్వీట్ చేయడం జరిగింది. దర్శకురాలిగా మంచి గుర్తింపు అందుకున్న ఐశ్వర్య ఆ పాటను అద్భుతంగా డిజైన్ చేసినట్లు కదా ధనుష్ ప్రశంసలు కురిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అలసిపోయినట్లు ఫొటో..
ఐశ్వర్య అప్పుడప్పుడు ఎవరూ ఊహించని విధంగా కొన్ని భావోద్వేగమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం విశేషం. ఆ మధ్య హాస్పిటల్లో అనారోగ్యానికి గురైనట్లు ఒక ఫోటో ని షేర్ చేసిన ఐశ్వర్య ఇప్పుడు మరొక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో ఆమె అలసిపోయినట్లు ఒక ఫొటో కూడా పోస్ట్ చేసింది.
Recommended Video


నొప్పితో అరుస్తున్నట్లు..
ట్విట్టర్ లో ఆమె ఈ విధంగా పేర్కొంది. దాదాపు ఒక నెల ఎక్కువ కాలం తర్వాత మళ్లీ వ్యాయామానికి తిరిగి రావడం జరిగింది. నా శరీరం నొప్పితో అరుస్తున్నట్లు విన్నాను.. నేను గోడపైకి జారిపోయాను. అలాగే నేను పడకుండా జాగ్రత్తగా ఉంటాను.. చిరునవ్వుతో ఆగిపోయాను. నేను ఇంతకు ముందే ఇలా చేశానని నాకు చెప్పుకుంటూ నా నుండి బలాన్ని పొందాను. కష్టం, చెమట ఇవి అన్ని కూడా పాజిటివ్ గా వెళ్ళాలి అంటూ ఐశ్వర్య వివరణ ఇచ్చింది.