»   »  రోబోకు ఐశ్వర్యా రాయ్ నో

రోబోకు ఐశ్వర్యా రాయ్ నో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai
రజనీకాంత్ నటిస్తున్న దర్శకుడు శంకర్ మెగా వెంచర్ రోబోలో నటించడానికి బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తిరస్కరించారని సమాచారం. ఈ సినిమాను శంకర్ మూడు భాషల్లో ఒకే సారి నిర్మించాలని తలపెట్టిన విషయం తెలిసిందే. సినిమాకు ఐశ్వర్యారాయ్ ని శంకర్ రెండేళ్ల పాటు కాల్షీట్లు అడిగారట. అయితే అది సాధ్యం కాదని ఆమె చెప్పారని సమాచారం. ఆమె సంతానాన్ని కనాలని నిర్ణయించుకోవడమే ఈ తిరస్కరణకు కారణమని అంటున్నారు.

తన 35 జన్మదినంలోగా సంతానాన్ని కనాలని ఆమె అనుకుంటున్నారట. 35 ఏళ్లు దాటితే కష్టమవుతుందని, ఈలోగానే సంతానం కనాలని ఆమె భావిస్తున్నారట. ఈ ఏడాదే ఐశ్వర్యకు 35 ఏళ్ల వయసు వస్తోంది. అందుకు కోసం ఆమె నిర్మాణంలో ఉన్న సినిమాలను పూర్తి చేసే బిజీలో ఉన్నారు.

గతంలో చంద్రముఖి సినిమాలో మొదట రజనీకాంత్ సరసన నటించేందుకు సిమ్రాన్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే సినిమా పూర్తయ్యేలోగా ఆమె గర్భం దాల్చారు. దీంతో సిమ్రాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సిమ్రాన్ స్థానంలో జ్యోతికను ఎంపిక చేసుకుని సినిమాను నిర్మించారు. రోబోకు అటువంటి చిక్కులు రాకూడదని శంకర్ అనుకుంటున్నారట. దీంతో ఐశ్వర్య రాయ్ ను పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X