»   »  ఐష్ ని కిడ్నాప్ చేయనున్న విక్రమ్...

ఐష్ ని కిడ్నాప్ చేయనున్న విక్రమ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai
అయితే ఇది నిజజీవితంలో కాదట. అభిషేక్ బచ్చన్,ఐశ్వర్యారాయ్ హీరో, హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించబోయే చిత్రంలోనట. ఈ విషయాన్ని నిన్న మీడియాకు విక్రమ్ వెళ్ళడించాడు. మధ్యలో విక్రమ్ గొడవ ఏంటంటే అసలు కిడ్నాప్ చేయబోయేది ఆయనేట. మణిరత్నం ఈ సినిమాని రామాయణం ఆధారంగా ఈ రోజులకు తగినట్లుగా కథ అల్లి చేస్తున్నారుట. ఆ కథ ప్రకారం రావణుడు పాత్ర విక్రమ్ వెయ్యబోతున్నాడుట. దాంతో ఆయనే ఐశ్వర్యను ఎత్తుకుపోతాడట. అలాగే ఈ సినిమా తమిళ వెర్షన్ లో ఆయన హీరోగా ,ఐశ్వర్య ప్రక్కన చేయబోతున్నాడు. అక్కడ మళయాళ నటుడు పృధ్వీరాజ్ ఆమెను కిడ్నాప్ చేస్తాడుట. అవునూ ఈ కథ వింటూంటే అప్పుడెప్పుడో శ్రీదర్ హీరోగా శారద ప్రధాన పాత్రలో బాపు రూపొందించిన కలియుగరావణాసురుడు సినిమా గుర్తుకు వస్తోంది కదూ. ఇక ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మాజీ హీరోయిన్ సిమ్రాన్ అసెస్టెంట్ డైరక్టర్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X