»   » ‘చంద్రముఖి-2’ లో నటించనున్న ప్రేమలేఖ అజిత్?

‘చంద్రముఖి-2’ లో నటించనున్న ప్రేమలేఖ అజిత్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగునాట ప్రేమలేఖ అజిత్ గా పేరు తెచ్చుకున్న అజిత్ త్వరలో 'చంద్రముఖి-2" లో హీరోగా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ తో రూపొందుతున్న ఈ చిత్రం రీమేక్ ని తమిళంలో రజనీకాంత్ రిజెక్టు చేసారు. అయితే తాను శంకర్‌ 'రోబో"తో బిజీగా ఉండడంతో అది కుదరలేదు కాబట్టి...తనకెంతో ఆప్తుడైన అజిత్‌ పేరు సూచించారట. దాంతో పి.వాసు అజిత్ ‌ను కలిసినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు ఇటీవల ముగిసినట్టు తెలుస్తోంది. విష్ణువర్ధన్‌ హీరోగా కన్నడలో 'ఆప్తరక్షక" పెద్దహిట్‌. 'బిల్లా"తో అక్కడ సంచలన విజయాన్ని సాధించిన అజిత్‌ 'బిల్లా2" సీక్వెల్‌ పనిలో ఉండగా ఈ 'చంద్రముఖి-2" అవకాశం వెతుక్కుంటూ రావడం మరో హిట్టు కోసమేనంటున్నారు. ఇక తెలుగు చంద్రముఖి-2లో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వెంకటేష్, అనూష్క కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే.

ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షకలో వెంకటేష్..విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఆప్త రక్షక కన్నడ చిత్రాన్ని కూడా పి.వాసు డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా చంద్రముఖి 2 అని వుంచి తర్వాత మార్చే యోచనలో ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్‌, పూనమ్ ‌కౌర్‌, రిచా గంగోపాధ్యాయ వెంకీతో ఆడిపాడతారు. సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే చంద్రముఖి చిత్రం చూసిన వాళ్ళు 'లక లక లక లక' ని మర్చిపోవటం చాలా కష్టం. ఇప్పుడా 'లక లక లక లక' డైలాగుని 'లీడర్‌' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ వల్లిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu