»   » ‘డిక్టేటర్’ తమిళ రీమేక్ హీరో ఖరారు!

‘డిక్టేటర్’ తమిళ రీమేక్ హీరో ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్' చిత్రాన్ని కోలీవుడ్, బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తొలుత డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావించారు. అయితే తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేయడం కంటే అక్కడి స్టార్ హీరోతో రీమేక్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనేది ఈరోస్ సంస్థ భావన.

ఇటీవల తమిళంలో వేదాలంతో మంచి హిట్ అందుకున్న అజిత్ అయితే బావుంటదని... అతనికి డిక్టేటర్ స్టోరీ వినిపించారని, అజిత్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని...అయితే సంక్రాంతికి తెలుగులో విడుదలైన తర్వాత ఫలితం చూసి కన్ఫర్మేషన్ ఇస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

బాలయ్య డిక్టేటర్ సినిమా విషయానికొస్తే...
బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 99వ చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 14న గ్రాండ్ లెవల్లో విడుద‌ల చేస్తున్నారు.

Ajith in Dictator Tamil remake?

సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బావుందని ప్రశంసించారు. నందమూరి బాలకృష్ణ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు బావున్నాయని, ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్ టైనర్ రూపొందడంలో ముఖ్య పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ సహా చిత్రయూనిట్ సెన్సార్ సభ్యులు అభినందించారు.

ఇప్పటికే ఎస్.ఎస్.థమన్ థ‌మ‌న్ సంగీతం అందించిన పాటలకు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుద‌ల చేసిన‌ యాక్ష‌న్ ట్రైల‌ర్‌కు ప్రేక్షాభిమానుల నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో ఆ రేంజ్‌లో స్ట‌యిలిష్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా బాల‌కృష్ణ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంటుందని కో ప్రొడ్యూస‌ర్‌, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తెలియ‌జేశారు.

ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Dictator movie starring Balakrishna is also said to be remade in Tamil. Initially this movie was thought f releasing in Tamil and Malayalam but the Eros International decided against it as it thought that this movie should be made with star hero of Tamil and accordingly Ajith also said to be okayed the subject.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu