»   » మా హీరోకు డూప్‌ నచ్చదు

మా హీరోకు డూప్‌ నచ్చదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెన్నై : 'బిల్లా'తో అజిత్‌కు కీలక మలుపునిచ్చిన స్టైలిష్ డైరక్టర్ విష్ణువర్ధన్‌. అజిత్‌ను మరింత సెలిష్‌గా చూపించి అభిమానులకు కనువిందు కలిగించాడు. తాజాగా ఇద్దరూ 'ఆరంభం'తో మరోసారి జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అజిత్‌ సరసన నయనతార నటిస్తోంది. ఆర్య, తాప్సీ మరోజంట. సెప్టెంబరు ప్రారంభంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర విశేషాల గురించి నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు విష్ణువర్ధన్‌ మీడియాతో ముచ్చటించారు.

  విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. అజిత్‌తో 'బిల్లా' తెరకెక్కించడం గొప్ప అనుభూతి. ఆ తరుణంలోనే మా మధ్య స్నేహం చిగురించింది. పోరాట సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడతారు. డూప్‌లు నచ్చవు. అందుకే అప్పుడప్పుడు చిత్రీకరణ సమయాల్లో గాయాలవుతుంటాయి. ఆర్య కూడా పూర్తిస్థాయిలో సహకరించినందున ఇద్దరు హీరోలతో సినిమా తీయగలిగా. 'బిల్లా'లో నయనతార పాత్రకు కితాబు లభించింది. అంతటి నటన, గ్లామర్‌ ఇందులోనూ ఉంటాయి. తాప్సీ కూడా చక్కగా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదిస్తున్నాం. సీక్వెల్‌ గురించి ఆలోచించలేదని తెలిపారు.

  ఏఎం రత్నం మాట్లాడుతూ.. మా నిర్మాణంలో అజిత్‌ నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో ఏఆర్‌ రెహ్మాన్‌ పాట పాడారన్న ప్రశ్నకు దర్శకుడు బదులిస్తూ.. ఇప్పటి వరకు రికార్డు చేసిన వాటిలో రెహ్మాన్‌ పాడలేదు. ఒకపాట మిగిలి ఉంది. ఆ గీతాన్ని వేరే గాయకుడు ఆలపిస్తారు. ఒకవేళ రెహ్మాన్‌ పాడేట్లయితే ఆ విషయాన్ని యువన్‌ వెల్లడిస్తారన్నారు.

  అజిత్ గతంలో మంగాత్తా (గాంబ్లర్) చిత్రంలో పాత్రకు తగ్గ గెటప్‌లో కనిపించి అభిమానులను అలరింపజేశారు. మరోసారి అలాంటి భిన్నమైన గెటప్‌లో ఆరంభం చిత్రంతో తెరపైకి రానున్నారు. నడి వయసు, మెరిసిన జుత్తు, నలుపు, తెలుపు గడ్డంతో ఆరంభం చిత్రంలో కొత్త అజిత్‌ను చూడబోతున్నారని దర్శకులు విష్ణువర్దన్ తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. మరో జంటగా ఆర్య, తాప్సీ నటిస్తున్నారు.

  ఆరంభం పేరును ఆలస్యంగా నిర్ణయించినా అద్భుతమైన స్పందన వచ్చిందని దర్శకుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇది పోరాటయోధుడు లాంటి వ్యక్తి కథ అని తెలిపారు. నయనతార, ఆర్య వంటి ముఖ్యపాత్రలు అజిత్ పాత్ర చుట్టూ తిరుగుతాయని చెప్పారు. ఇది పక్కా కమర్షియల్ కథా చిత్రమని పేర్కొన్నారు. ఇందులో అజిత్ గెటప్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఆరంభం చిత్రంలోని పాత్రను అజిత్ మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. ఇది తమ కాంబినేషన్‌లో వచ్చిన బిల్లా చిత్రం కంటే సూపర్ వేగంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

  ఈ చిత్రంలో అజిత్..సైబర్ క్రైమ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. కథలో భాగంగా ఆయన సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎక్కౌంట్ లు హ్యాక్ చేస్తాడు. అప్పుడు కొన్ని విషయాలు బయిటపడతాయి. ఆ దిసగా ధర్వాప్తు ప్రారంభిస్తాడు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే దిసగా సినిమా నడుస్తుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాకు మొదట వాలి అనే టైటిల్ అనుకున్నారు. కానీ నిర్మాతలకు ఆ పేరు ఇష్టం లేదు. చాలా కాలంగా..ఈ టైటిల్ వివాదం సాగుతోంది. రకరకాల టైటిల్స్ అనుకున్నారు. కానీ ఆరంభం అనే టైటిల్ కు అంతా ఓటు వేసారు. టెక్నికల్ గా చిత్రం చాలా సౌండ్ గా ఉండబోతోందని అంటున్నారు.

  English summary
  The buzz is that Ajith denied the idea of using a dupe for this scene in Aarambam and wanted to do it himself and the the star for a whole night was hanging upside down. The most exciting factor is Ajith did not accept any dupes for these risky Stunt scenes. He has done all those dare-devil actions.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more