Just In
- 1 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 8 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
- 18 min ago
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- 52 min ago
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
Don't Miss!
- News
కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో
- Sports
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అజిత్ సినిమాకు భారీ రేటు: ‘వాలిమై’ తెలుగు రైట్స్ తీసుకున్న టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్
పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విలక్షణ నటుడు అజిత్ కుమార్. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయన.. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ తన సినిమాలను విడుదల చేస్తూ మంచి మార్కెట్‌ను అందుకున్నారు. ఈ కారణంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్ తాజా చిత్రం 'వాలిమై'ను తెలుగు హక్కులను ఓ బడా ప్రొడ్యూసర్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
'నెర్కొండ పార్వాయి' వంటి భారీ హిట్ తర్వాత అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం 'వాలిమై'. హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఓవర్సీస్.. తెలుగు హక్కుల కోసం పోటీ నెలకొని ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల హక్కులు అమ్ముపోయాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ హక్కులను యునైటెడ్ ఇండియా ఎక్స్‌పోర్ట్ సంస్థ రూ. 20 కోట్లకు కొనగోలు చేసిందట. అలాగే, తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ రూ. 10 కోట్లకు కొన్నారని సమాచారం.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అజిత్ కుమార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి మధ్య వయస్కుడి పాత్ర కాగా, మరొకటి బైక్ రేసర్ రోల్ అని అంటున్నారు. ఈ పాత్రపై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తోన్న సమయంలోనే అజిత్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం 2021 వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.