»   » కేక పుట్టించిన కలెక్షన్స్: రెండు రోజుల్లో 20 కోట్లు

కేక పుట్టించిన కలెక్షన్స్: రెండు రోజుల్లో 20 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రం సూపర్ హిట్ టాకుతో దూసుకెలుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో ఏకంగా రూ. 20.83 కోట్లు వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది.

ప్రముఖ ట్రేడ్ అనాలసిస్ట్ త్రినాథ్ ఈ సినిమా కలెక్షన్లపై స్పందిస్తూ..‘ఎన్నై అరిందాల్ కలెక్షన్లు ఆశ్చర్య పరిచే విధంగా ఉన్నాయి. తొలి రోజు రూ. 11.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ. 20.83 కోట్లు వసూలు చేసింది. గురువారం రిలీజ్ అయినా ఈ రేంజిలో రెస్పాన్స్ రావడం ఆశ్చర్యకరం' అన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘ఎన్నై అరిందాల్' సినిమా విషయానిస్తే..గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇపుడు రిలీజైంది. ‘ఐ' సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే సినిమాను వాయిదా వేసారి అప్పట్లో టాక్. కానీ ఈ సినిమా అపుడు విడుదలయి ఉంటే ‘ఐ' సినిమాకు భారీ నష్టం జరిగి ఉండేదని సినిమా చూసిన వారు అంటున్నారు. ఆ రేంజిలో ఉంది మరి ఈ సినిమా టాక్.

Ajith Kumar's Yennai Arindhaal collects Rs 20.83 crore

విడుదలైన తర్వాత ఈ చిత్రం భారీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో అజిత్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "ఎంతవాడు కానీ.." అనే పేరుతో డబ్ అయి విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పడే సినిమా హిట్ అవుతుందని అంచనాలు వేసారు. అంతా అనుకున్నట్లే జరిగింది. అజిత్ మూడు వైవిధ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిషలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.

ఆర్టిఫిషియల్‌ లుక్‌తో కనిపించకూడదనే ఉద్దేశంతో అజిత్‌ కుమార్‌ ఈ సినిమాలోనూ తెల్లజుట్టుతోనే కనిపించారు. ఇది పోలీస్‌ యాక్షన్ ఎంటర్టెనర్. అదే సమయంలో గౌతం మీనన్ చిత్రాల నుండి ఆశించే రొమాంటిక్ సీన్లు కూడా మెండుగానే ఉన్నాయట. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సీన్లు మంచి కిక్ ఇస్తాయని అంటున్నారు త్వలోనే తెలుగు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

English summary
Actor Ajith Kumar's Tamil action-thriller "Yennai Arindhaal", despite hitting the screens on a weekday, managed to gross Rs.20.83 crore within the first two days of release in Tamil Nadu.
Please Wait while comments are loading...