»   » తాల..ఫస్ట్ లుక్ అదరొహో(ఫొటోలు)

తాల..ఫస్ట్ లుక్ అదరొహో(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ వచ్చేసింది. అజిత్ 56వ చిత్రం కు 'వేదలమ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సినిమాకు వేదలమ్ అనే టైటిల్ పెట్టడంలో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

నిజానికి వినాయిక చవితి రోజే ఈ చిత్రం ఫస్ట్ లుక్ వస్తుందని అంతా భావించారు. అయితే ఆ రోజు రజనీకాంత్ కబాలి ఫస్ట్ లుక్ రావటంతో వెనక్కి తగ్గారు. ఈ ఫస్ట్ లుక్ లో అజిత్ ఇప్పటివరకూ అభిమానులు చూడని విధంగా ఉన్నాడు. రెడ్ కలర్ డ్రస్, తెల్ల గడ్డం, నెరిసిన జుట్టుతో అజిత్ కనిపించటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Ajith's 56 movie title Vedhalam

'ఎన్నై అరిందాల్‌'తో విజయాన్ని సొంతం చేసుకున్న 'తాల' అజిత్‌ ప్రస్తుతం 56వ సినిమాలో నటిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తుండగా... శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో శివ, అజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'వీరం' (వీరుడొక్కడే) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా చిత్రంలో అజిత్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. దీని షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది.

చిత్రం విషయానికి వస్తే.... తమిళ సూపర్ స్టార్ అజిత్ వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు..ఎన్నై అరిందాల్ కంటే ముందు అజిత్, సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో వీరమ్ అనే సినిమా చేశాడు..ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్ద హిట్ అయింది..దీంతో ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కనుందట అందుకు అజిత్ కు చెల్లిలుగా ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి..

Ajith's 56 movie title Vedhalam

అందులో బిందు మాధవి, నిత్య మీనన్ పేర్లు ముఖ్యమైనవి. ఫైనల్ గా ఈ పాత్రకు కోలీవుడ్ బొద్దుగుమ్మ లక్ష్మీ మీనన్ ఫైనల్ అయ్యింది..లక్ష్మీ మీనన్ కోలీవుడ్ లో హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది. లక్ష్మీ ఇంతకు ముందు విశాల్ సరసన 'పల్నాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందకు వచ్చింది. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ కార్తీతో పాటు గౌతమ్ కార్తిక్ సినిమాలలో నటిస్తోంది. హీరోయిన్ గా మాంచి ఫామ్ లో ఉన్న లక్ష్మీ ఇప్పుడు సడెన్ గా అజిత్ కు చెల్లెలిగా నటిస్తోందని వినిపిస్తోంది.

అజిత్ స్టార్ హీరో కాబట్టి ఈ ఆఫర్ ను మిప్ చేసుకోదని లక్ష్మీ మీనన్ భావించిందట. మరో వైపు అజిత్ కు చెల్లెలిగా అమ్మడు ఒప్పుకుందంటే ఆ పాత్ర కు ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో అర్థం అవుతందంటున్నారు కోలీవుడ్ జనం. ఏదేమైనా హీరోయిన్ గా దూసుకుపోతున్న లక్ష్మీ మీనన్ కెరీర్ పై ఈ సినిమా ప్రభావం చూపుదంటంటున్నారు.

English summary
The long wait is over.. Ajith Kumar's 56th film has titled as "Vedalam" produced by Sri Sai Raam Creations, Direction by Siva. The movie will be released on Diwali 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu