»   » అప్పు తీర్చాకే రిలీజ్ అని పెద్ద నిర్మాతకు...కోర్టు

అప్పు తీర్చాకే రిలీజ్ అని పెద్ద నిర్మాతకు...కోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : పెద్ద సినిమాలు ఏ నిముషంకి ఏ ఇబ్బంది వస్తుందో ఎవరికీ తెలియదు. తాజాగా ఏఎం రత్నం నిర్మాణంలో 'తల' అజిత్‌ నటించిన కొత్త చిత్రం 'ఆరంభం'. విష్ణువర్దన్‌ దర్శకత్వం వహించారు. నయనతార కథానాయిక. 'బిల్లా' తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాను దీపావళి కానుకగా, అంతకన్నా కొన్ని రోజుల ముందే సినిమాను విడుదల చేయాలని నిర్మాణ వర్గాలు భావించాయి. ప్రస్తుతం కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి.

ఏఎం రత్నం తనకు ఇవ్వాల్సిన రుణాన్ని ఇచ్చిన తర్వాత సినిమాను విడుదల చేయాలని హైకోర్టులో షెనాయ్‌నగర్‌కు చెందిన రాజేశ్వరి ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. 2005లో 'కేడీ' సినిమా నిర్మాణం కోసం రూ.1.5 కోట్లు తీసుకున్నారని, ఆ నగదు తిరిగిచ్చాక సినిమాను విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. రెండువారాల్లో సమాధానం ఇవ్వాలని ఏఎం రతానికి నోటీసులు జారీ అయ్యాయి. విచారణ 25వ తేదీకి వాయిదా వేశారు.


'ఆరంభం' గతంలో వచ్చిన 'బిల్లా'ను మించిన వేగంతో ఉంటుందని దర్శకుడు విష్ణువర్ధన్‌ పేర్కొంటున్నాడు. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, మరో జంటగా ఆర్య-తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా అజిత్ కెరీర్ లో పెద్ద హిట్ నమోదు చేస్తుందని హామీ ఇస్తున్నాడు. విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. 'బిల్లా'లాంటి మెగాహిట్‌ తర్వాత అజిత్‌తో మరోసారి పని చేయటం ఆనందంగా ఉంది. 'మంగాత్తా'లో సగానికి పైగా నెరసిన వెంట్రుకలతో కనిపించిన అజిత్‌ ఇందులోనూ అదే గెటప్‌లో అలరించనున్నాడు. అలా చూపాలని మా యూనిట్‌ ముందుగానే అనుకుంది. వెంకట్‌ ప్రభు మాకన్నా వేగంగా స్పందించి 'మంగాత్తా'లో ఆ క్రెడిట్‌ కొట్టేశాడు. 'ఆరంభం' ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లేలో 'బిల్లా'ను మించే వేగం ఉంటుంది. తమిళ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని వివరించాడు.


కథ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఇంకా చాలా పనులున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రతి ఫ్రేమూ ఎంతో కష్టపడి చిత్రీకరించాం. కేవలం అజిత్‌ అభిమానులకే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పగలను. అజిత్‌కు తగ్గట్టు పలు పంచ్‌ డైలాగులున్నాయి. 'తుప్పాక్కి వైతిరుక్కురవన్‌ పేసమాట్టాన్‌'.. (తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు) వంటి సంభాషణలు థియేటర్‌లో పేలడం ఖాయం. అజిత్‌, ఆర్య కలయిక అనుకున్నట్టే క్లిక్‌ అయింది. ఇక ప్రేక్షకుల ముందు తెరపై పండటమే మిగిలి ఉంది. ఆ విషయాన్ని త్వరలో మీరే చూస్తారుగా అని ముగించారు.

English summary
A city-based film financier has moved the Madras High Court alleging that film producer and director AM Ratnam has failed to return Rs 1.50 crore and prayed the court to stop the release of Tamil feature film Arambam starring Ajit, Adiya and Nayanthara. The application arising out of a civil suit was filed by B Rajeswari, represented by her son B Anantha Krishnan of Shenoy Nagar. Justice V Ramasubramanian ordered the notice to Ratnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu