twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణం: సినిమా చూడ్డానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై పెట్రోలు పోసి నిప్పు!

    |

    హీరోలను అభిమానించడంలో తప్పులేదు... కానీ ఆ అభిమానం పిచ్చిగా మారితేనే ప్రమాదం. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. అజిత్ అనే పేరుగల యువకుడు తమిళ హీరో అజిత్‌కు వీరాభిమాని. తాజాగా విడుదలైన తన హీరో మూవీ 'విశ్వాసం' టికెట్ కొనుక్కునేందుకు డబ్బు ఇవ్వలేదని ఏకంగా తండ్రికి నిప్పంటించాడు.

    ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం 'విశ్వాసం' రిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

    డబ్బు ఇవ్వక పోవడం వల్లనే

    డబ్బు ఇవ్వక పోవడం వల్లనే

    ‘విశ్వాసం' మూవీ ఫ్యాన్స్ స్పెషల్ షో టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రి పాండ్యన్(45)తో గొడవ పడిన అజిత్...చివరకు తండ్రి అనే కనికరం కూడా లేకుండా నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న పాండ్యన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    అజిత్ అభిమానుల గొడవ, కత్తిపోట్లు

    అజిత్ అభిమానుల గొడవ, కత్తిపోట్లు

    ఇదిలా ఉంటే... వెల్లూరు జిల్లాలో జరిగిన మరో సంఘటనలో అజిత్ అభిమానులు ఇద్దరు గొడవ పడ్డారు, ఈ ఘటనలో ఇద్దరికీ కత్తిపోట్లయ్యాయి. గాయపడిన వ్యక్తులను రమేష్, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరి పరిస్థితి సిరీయస్‌గా ఉన్నట్లు సమాచారం.

    పేట, విశ్వాసం

    పేట, విశ్వాసం

    ఓ వైపు రజనీకాంత్ నటించిన ‘పేట', మరో వైపు అజత్ నటించిన ‘విశ్వాసం' రెండు సినిమాలో ఒకరోజు సంక్రాంతి సందర్భంగా విడుదల కావడంతో తమిళనాడులో సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది.

    రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్

    రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్

    పలు చోట్ల రజనీకాంత్, అజిత్ అభిమానుల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో కొన్ని చోట్ల పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్స్ ఇలా పిచ్చిగా, ఉన్మాదంగా ప్రవర్తిస్తుండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    Tamil Media source said that, Ajith Fan set ablaze his father for not giving money to buy a ticket for the movie 'Viswasam'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X