»   » పవన్ దర్సకుడు నెక్ట్స్ చిత్రం టైటిల్ 'ఆరంభం'

పవన్ దర్సకుడు నెక్ట్స్ చిత్రం టైటిల్ 'ఆరంభం'

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రం తీసిన విష్ణు వర్ధన్ గుర్తుండే ఉంటారు. ఆయన తాజా చిత్రానికి 'ఆరంభం' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో అజిత్ హీరోగా చేస్తున్నారు. చాలాకాలం తర్వాత ఏఎం రత్నం నిర్మాణంలో అజిత్‌ హీరోగా చేస్తూండటంతో క్రేజ్ ఓ రేంజిలో వచ్చింది.

హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న స్టార్ హీరో అజిత్‌. ఆయన సినిమాకు కొబ్బరికాయ కొట్టినా పండగే, పేరు పెట్టినా సంబరమే. ఆడియో విడుదలైతే కోలాహలం. ఇక థియేటర్లలోకి వస్తే జాతరే! 'బిల్లా-2' తర్వాత అజిత్‌ రెండు చిత్రాల్లో వరుసగా నటిస్తున్నారు.

విజయా పిక్చర్స్‌ బ్యానరుపై మరో సినిమాలో నటిస్తున్నారు. ఏఎంరత్నం సినిమాకు విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. ఆర్య, తాప్సి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ ప్రారంభమై చాలాకాలమైనా ఇంకా పేరు పెట్టలేదు. కొన్ని టైటిళ్లు వినిపించినా ఖరారు చేయలేదు.

మిగతా కథనం ..స్లైడ్ షో లో...

ఆరంభం

ఆరంభం

ఈ చిత్రంలో అజిత్..సైబర్ క్రైమ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. కథలో భాగంగా ఆయన సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎక్కౌంట్ లు హ్యాక్ చేస్తాడు. అప్పుడు కొన్ని విషయాలు బయిటపడతాయి. ఆ దిసగా ధర్వాప్తు ప్రారంభిస్తాడు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే దిసగా సినిమా నడుస్తుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది.

టైటిల్ వేరేది

టైటిల్ వేరేది

ఈ సినిమాకు మొదట వాలి అనే టైటిల్ అనుకున్నారు. కానీ నిర్మాతలకు ఆ పేరు ఇష్టం లేదు. చాలా కాలంగా..ఈ టైటిల్ వివాదం సాగుతోంది. రకరకాల టైటిల్స్ అనుకున్నారు. కానీ ఆరంభం అనే టైటిల్ కు అంతా ఓటు వేసారు. టెక్నికల్ గా చిత్రం చాలా సౌండ్ గా ఉండబోతోందని అంటున్నారు

లొకేషన్స్ డిఫెరెంట్ గా..

లొకేషన్స్ డిఫెరెంట్ గా..

ఈ చిత్రం కోసం రకరకాల లొకేషన్స్ ని దర్శకుడు హంట్ చేసి మరీ పట్టుకున్నారు. బెంగుళూరు, ఒరిస్సా, దుబాయిలలో ఎక్కువ భాగం షూట్ చేసారు. ఈ చిత్రంపై అజిత్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. సినిమా మంచి విజయం సాధిస్తుంద ని నిర్మాతలు సైతం అంటున్నారు.

మరో హీరో కూడా...

మరో హీరో కూడా...

ఈ సినిమాలో మరో క్రేజీ హీరో ఆర్య కనిపించనున్నాడు. వీరిద్దరూ చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాయని చెప్తున్నారు. చిత్రం షూటింగ్ లో ... అజిత్ గాయపడ్డారు. అయినా షూటింగ్ ఎక్కడా ఆపు చేయలేదు.

నయతార, రానా

నయతార, రానా

ఈ సినిమాలో తెలుగు వారికి బాగా పరిచయమున్న దగ్గుపాటి రానా, నయనతార కనిపించనున్నారు. నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఆమె రికమండేషన్ తోటే రానా కి ఈ చిత్రంలో భాగం ఇచ్చారని చెప్పుకున్నారు. రానా కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో 'ఆరంభం' అనే శీర్షికను ఎంపిక చేశారు. ముంబయిలో చోటుచేసుకున్న యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. యువన్‌శంకర్‌రాజాసంగీతం సమకూర్చారు. సెప్టెంబరులో తెరపైకి రానుంది.

English summary
The mystery over the title of Ajith Kumar's next movie directed by Vishnuvardhan is finally solved. After making people and media guess the name of the movie for over one year, they have finally announced the same. Well, the title is - Arrambam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu