»   » ఆగస్టు 15న టైటిల్ ప్రకటన..మొదట అక్షరం 'వి'

ఆగస్టు 15న టైటిల్ ప్రకటన..మొదట అక్షరం 'వి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : చిత్రం టైటిల్ పెట్టడం అనుకున్నంత ఈజీ కాదు. జనాల్లోకి వేగంగా వెళ్లాలి, చీప్ గా ఉండకూడదు..అలాగే కథను ప్రతిబింబంచాలి, హీరోని,నిర్మాతను ఒప్పించాలి ఇన్ని దర్శకుడుకి టైటిల్ విషయంలో ఉన్న సమస్యలు. అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే అభిమానులకు కొన్ని ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని మరీ టైటిల్ నిర్ణయించాలి. ఇప్పుడు ఈ టైటిల్ సందిగ్దంలోనే ఉన్నాడు అజిత్ తో చిత్రం చేస్తున్న దర్శకుడు శివ. పూర్తి వివరాల్లోకి వెళితే...

'ఎన్నై అరిందాల్‌'తో విజయాన్ని సొంతం చేసుకున్న 'తల' అజిత్‌ ప్రస్తుతం 56వ సినిమాలో నటిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తుండగా... శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో శివ, అజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'వీరం' (వీరుడొక్కడే) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తాజా చిత్రంలో అజిత్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. దీని షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. పలు రకాల టైటిళ్లను అనుకుంటున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పేర్లు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. టైటిల్‌ను రానున్న 15వ తేదీన ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ చిత్రం టైటిల్ మొదటి అక్షరం..వి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ajith's 'Thala 56' Title to be Announced on 15 August?

చిత్రం విషయానికి వస్తే....

తమిళ సూపర్ స్టార్ అజిత్ వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు..ఎన్నై అరిందాల్ కంటే ముందు అజిత్, సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో వీరమ్ అనే సినిమా చేశాడు..ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్ద హిట్ అయింది..దీంతో ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధమైంది.

అయితే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కనుందట అందుకు అజిత్ కు చెల్లిలుగా ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి.. అందులో బిందు మాధవి, నిత్య మీనన్ పేర్లు ముఖ్యమైనవి. ఫైనల్ గా ఈ పాత్రకు కోలీవుడ్ బొద్దుగుమ్మ లక్ష్మీ మీనన్ ఫైనల్ అయ్యింది..లక్ష్మీ మీనన్ కోలీవుడ్ లో హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది.

లక్ష్మీ ఇంతకు ముందు విశాల్ సరసన 'పల్నాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందకు వచ్చింది. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ కార్తీతో పాటు గౌతమ్ కార్తిక్ సినిమాలలో నటిస్తోంది. హీరోయిన్ గా మాంచి ఫామ్ లో ఉన్న లక్ష్మీ ఇప్పుడు సడెన్ గా అజిత్ కు చెల్లెలిగా నటిస్తోందని వినిపిస్తోంది.

అజిత్ స్టార్ హీరో కాబట్టి ఈ ఆఫర్ ను మిప్ చేసుకోదని లక్ష్మీ మీనన్ భావించిందట. మరో వైపు అజిత్ కు చెల్లెలిగా అమ్మడు ఒప్పుకుందంటే ఆ పాత్ర కు ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో అర్థం అవుతందంటున్నారు కోలీవుడ్ జనం. ఏదేమైనా హీరోయిన్ గా దూసుకుపోతున్న లక్ష్మీ మీనన్ కెరీర్ పై ఈ సినిమా ప్రభావం చూపుదంటంటున్నారు.

English summary
The title of Ajith's forthcoming movie, which is temporarily called "Thala 56", will be announced on 15 August as an Independence Day treat for Kollywood fans.
Please Wait while comments are loading...