#ValimaiFirstLook అజిత్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. ఇక రచ్చ రచ్చే!

తమిళ నాట సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. అభిమానులంతా తలా అని ముద్దుగా పిలుచుకునే ఆయన నుంచి చాలా రోజుల నుంచి సరైన అప్డేట్ లేదు. సుదీర్ఘ కాలం పాటు హిట్ లేక ఇబ్బందులు పడ్డ అజిత్ 'పింక్' రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం 'వాలిమై'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అయినప్పటికీ ఈ మూవీ నుంచి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మొన్ననే ఓ ఆసక్తికరమైన వార్త చెప్పాడు దర్శకుడు వినోథ్. 'వాలిమై ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజా పరిస్థితుల్లో దర్శకుడు వినోద్ దీని పై మాట్లాడుతూ 'ఫస్ట్ లుక్ పోస్టర్ ఆలస్యం అయినా అందరి అంచనాలకు తగ్గట్లుగా ఉంటుంది' అని హింట్ ఇచ్చారు. అలా చెప్పి దాని మీద మరింత అంచనాలను పెంచేశాడు. ఇక 'వాలిమై' ఫస్ట్ లుక్ పోస్టర్ రావడం లేదని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

 Ajiths Valimai First Look Motion Poster will be out on 11th july

ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ కుమార్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేస్తున్నట్టు లీక్ వచ్చింది. నిజానికి కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రచారం మేరకు 'వాలిమై' మూవీ ఫస్ట్ జూలై 15న విడుదల కాబోతుందట. అందులోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీంతో తలా అభిమానులు సంబరాలు చేసుకోగా ఎవరూ ఊహించని విధంగా ఈరోజు సాయంత్రం ఆరు తరువాత రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వార్త బయటకు వచ్చిందో లేదో, వాలిమై అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చూడాలి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X